OG Movie: పవన్ కళ్యాణ్ కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రాలలో ఒకటి ‘ఓజీ’. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని #RRR మేకర్స్ దీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే 70 శాతం కి పైగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ప్రస్తుతం బ్యాంకాక్ లో ఒక కీలక షెడ్యూల్ ని జరుపుకుంటుంది. జపాన్, థాయిలాండ్ పాపులర్ యాక్టర్స్ తో గత వారం రోజుల నుండి పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. నేటి నుండి ఈ సినిమాకి సంబంధించిన ఐటెం సాంగ్ ని చిత్రీకరించడం మొదలు పెట్టారు మేకర్స్. ఈ ఐటెం సాంగ్ లో డీజే టిల్లు బ్యూటీ నేహా శెట్టి మెరవనుంది. థమన్ స్వరపర్చిన ఈ ఐటెం సాంగ్ అద్భుతంగా వచ్చిందని టాక్. అయితే ఈ పాటలో పవన్ కళ్యాణ్ కనిపించడట. ఆయన లేకుండా విలన్ గ్యాంగ్ తో ఈ పాట ఉంటుందని టాక్.
హీరో లేకుండా ఐటెం సాంగ్ ఏంటి బాబోయ్ అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియా లో మేకర్స్ ని ట్యాగ్ చేసి అడుగుతున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ నెలాఖరున వరకు బ్యాంకాక్ లో కీలక షెడ్యూల్ ని జరుపుకోనున్న ఈ చిత్రం, జనవరి నెల నుండి అమరావతి లో ప్రస్తుతం నిర్మిస్తున్న భారీ సెట్ లో షూటింగ్ జరుపుకోనుంది. ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొనబోతున్నాడు. ప్రస్తుతం ఆయన ‘హరి హర వీరమల్లు’ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. 22 వ తారీఖు తో షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేయాలనీ ముందుగా అనుకున్నప్పటికీ, పవన్ కళ్యాణ్ కి ఉన్నటువంటి బిజీ షెడ్యూల్ కారణంగా వాయిదా వెయ్యాల్సి వచ్చింది. ఈ నెలాఖరుతో షూటింగ్ కార్యక్రమాలు మొత్తాన్ని పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఈ చిత్రం మార్చి 28 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది.
మరో పక్క ఓజీ మేకర్స్ కూడా అదే తేదీ పై టార్గెట్ చేసారు. జనవరి నెలలో పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తాడు కాబట్టి, కేవలం 20 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసేస్తే, మార్చి 27 కి ఈ చిత్రాన్ని విడుదల చెయ్యొచ్చని, పవన్ కళ్యాణ్ తో ఒకసారి చర్చలు జరిపి ముందుగా ఓజీ నే విడుదల చేయించే ప్రయత్నాలు చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. జనవరి నెలలో ఈ విడుదల తేదీలపై ఒక పూర్తి స్థాయి స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు మేకర్స్. ఇదంతా పక్కన పెడితే ఓజీ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ఇప్పటికే పూర్తి అయ్యినట్టు తెలుస్తుంది. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 200 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగిందని అంటున్నారు. అదే డిజిటల్ + సాటిలైట్ + ఆడియో రైట్స్ కలిపి మరో 200 కోట్ల రూపాయిల బిజినెస్ జరిగిందట.