https://oktelugu.com/

Allu Arjun: పవన్ కళ్యాణ్ ని కలిసేందుకు అల్లు అర్జున్ విశ్వ ప్రయత్నాలు..అపాయింట్మెంట్ కోసం ఎదురు చూపులు!

గత రెండు రోజుల నుండి అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ని కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడట. అందుకోసం పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సిబ్బందిని ఆయన అపాయింట్మెంట్ కోరినట్టు తెలుస్తుంది. అభిమానులు వీళ్లిద్దరి కలయిక కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Written By:
  • Vicky
  • , Updated On : December 18, 2024 / 03:10 PM IST

    Allu Arjun(4)

    Follow us on

    Allu Arjun: డిసెంబర్ నెల మొత్తం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మేనియా నే కనిపిస్తుంది. ఒక పక్క ‘పుష్ప 2’ చిత్రంతో బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన రికార్డ్స్ ని నమోదు చేస్తూ, మొదటి వారం లోనే వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టి, మన టాలీవుడ్ స్థాయిని పెంచిన హీరోగా ట్రేడ్ పండితుల చేత ప్రశంసలను అందుకుంటున్న అల్లు అర్జున్, మరోపక్క సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసిలాట ఘటనలో అరెస్ట్ అయ్యి, ఆ తర్వాత బెయిల్ మీద విడుదలై మరింత హాట్ టాపిక్ గా మారిపోయాడు. అల్లు అర్జున్ బెయిల్ మీద విడుదలై ఇంటికి వచ్చిన తర్వాత టాలీవుడ్ సెలబ్రిటీస్ మొత్తం ఆయన ఇంటి వద్దకు వచ్చి అల్లు అర్జున్ పట్ల సంఘీభావం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆ తర్వాత అల్లు అర్జున్ తన కుటుంబం తో కలిసి చిరంజీవి, నాగబాబు ఇళ్లకు వెళ్లి తన బెయిల్ కోసం కష్టపడినందుకు కృతఙ్ఞతలు తెలియచేయడం హాట్ టాపిక్ గా మారింది.

    అయితే గత రెండు రోజుల నుండి అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ని కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడట. అందుకోసం పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సిబ్బందిని ఆయన అపాయింట్మెంట్ కోరినట్టు తెలుస్తుంది. అభిమానులు వీళ్లిద్దరి కలయిక కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే గత ఆరు నెలల నుండి వీళ్ళ మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది అంటూ సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. అయితే రీసెంట్ గానే టికెట్ రేట్స్ ఆంధ్ర ప్రదేశ్ లో కోరినంత ఇప్పించినందుకు పవన్ కళ్యాణ్ కి అల్లు అర్జున్ సక్సెస్ మీట్ లో ప్రత్యేకించి కృతఙ్ఞతలు తెలియచేసాడు. అయితే ఇప్పుడు ఆయన వ్యక్తిగతంగా కలిసి ధన్యవాదాలు తెలియచేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ కి ఉన్న బిజీ షెడ్యూల్ వల్ల అపాయింట్మెంట్ కుదరడం లేదట.

    ఇదే ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారిన అంశం. పవన్ కళ్యాణ్ నిజంగానే బిజీ గా ఉండడం వల్ల అల్లు అర్జున్ కి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదా?, లేకపోతే ఆయన మనసులో అల్లు అర్జున్ పై కోపం ఉండడం వల్లే ఇవ్వడం లేదా అని అభిమానులు సందేహిస్తున్నారు. ఎందుకంటే నంద్యాల ఘటనపై పవన్ కళ్యాణ్ నిజంగానే బాధ పడ్డాడని రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్న చర్చ. పదేళ్ల నుండి ఎన్నో అవమానాలు, ఛీత్కారాలు మధ్య పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ని నెట్టుకొచ్చాడు. ఆయనకీ ఈ ఎన్నికలు ఎంతో ముఖ్యం. సినీ ఇండస్ట్రీ మొత్తం పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పిఠాపురం లో రేయింబవళ్లు కష్టపడి ప్రతీ ఇంటికి తిరిగి ఓట్లు అడుగుతుంటే, అల్లు అర్జున్ మాత్రం వైసీపీ పార్టీ నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి కి సపోర్ట్ చేయడం ఆయనకీ ఏమాత్రం నచ్చలేదు. కేవలం పవన్ కళ్యాణ్ కి మాత్రమే కాదు , మెగా ఫ్యామిలీ లో ఎవరికీ నచ్చలేదు. అందుకే పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ని కలిసేందుకు ఇష్టపడడం లేదని టాక్ వినిపిస్తుంది.