Pawan Kalyan OG Movie
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్(Pawan Kalyan) చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ఆయన రెండు సినిమాలు పూర్తి చేయడానికి కేవలం నెల రోజుల కాల్ షీట్స్ మాత్రమే కావాలి. ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రానికి నాలుగు రోజులు, అదే విధంగా ‘ఓజీ’ (They Call Him OG) చిత్రానికి 23 రోజులు. ఇవి పూర్తి చేయడానికి ఆయన నిర్మాతలకు మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నాడు. 15 రోజుల క్రితం అయితే ఆయన ప్రభుత్వ కార్యకలాపాలలో ఫుల్ బిజీ గా ఉన్నాడు కాబట్టి సినిమాలు చేయడం లేదు,గ్యాప్ ఇచ్చాడు అనుకోవచ్చు. కానీ గత 15 రోజులుగా ఆయన వెన్ను నొప్పి కారణంగా విశ్రాంతి తీసుకుంటూ వచ్చాడు. ఒక్క ప్రభుత్వ కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొనలేదు. రివ్యూ మీటింగ్స్ మొత్తం పక్కన పెట్టేసాడు. మంగళగిరి క్యాంప్ కార్యాలయంలో ఎన్నో ఫైల్స్ పెండింగ్ లో పడ్డాయి. రెండు రోజుల క్రితమే ఆయన అనారోగ్యం నుండి కోలుకున్నాడు.
సీఎం చంద్రబాబు(Chandrababu Naidu) నిన్న మంత్రులతో, సెక్రటరేట్ అధికారులతో కాన్ఫరెన్స్ సమావేశం ఏర్పాటు చేస్తే పవన్ కళ్యాణ్ తప్ప, అందరూ హాజరయ్యారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కి ఫోన్ చేసి, అసలు ఏమైంది, ఎందుకు యాక్టీవ్ గా లేరు అని కనుక్కునే ప్రయత్నం చేయగా, ఆయన అందుబాటులోకి రాలేదట. ఇదే విషయాన్నీ జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్ ని చంద్రబాబు అడగ్గా, ఆయన వెన్ను నొప్పితో బాధపడుతున్నాడని, విశ్రాంతి తీసుకుంటున్నాడని, రెండు మూడు రోజుల్లో మళ్ళీ విధుల్లోకి వస్తాడని చెప్పుకొచ్చాడు. ఆయనకీ ఎలా ఉందో ఒక్కసారి కనుక్కోండి అని చంద్రబాబు అధికారులకు చెప్పాడు. కట్ చేస్తే నేడు ఉదయం ఆయన నాలుగు రోజుల పాటు కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో పవిత్ర దేవాలయాలను సందర్శించడానికి పయనమయ్యాడు. రెండు రోజుల క్రితమే అనారోగ్యం నుండి కోలుకున్న పవన్ కళ్యాణ్, నిన్న కాన్ఫరెన్స్ కి ఎందుకు హాజరు కాలేదు?, అసలు ఆయన మనసులో ఏముంది అనే విషయం జనసేన నాయకులకు కూడా అంతు చిక్కడం లేదు.
ఇష్టమొచ్చినట్టు పవన్ కళ్యాణ్ గత 15 రోజులు సమయాన్ని వృధా చేసాడు. అటు ప్రభుత్వ కార్యక్రమాలు ముందుకు కదలడం లేదు, ఇటు సినిమాలు మూలనపడ్డాయి. ఓజీ దర్శకుడు సుజిత్ అయితే తీవ్రమైన అసహనం తో ఉన్నాడట. తీర్థయాత్రలకు సమయాన్ని కేటాయిస్తాడు కానీ, సినిమాకి మాత్రం డేట్స్ ఇవ్వడు, షారుఖ్ ఖాన్ లాంటి స్టార్ తో సినిమా చేసే అవకాశం వచ్చినా, కళ్యాణ్ గారి కోసం ఇంత కాలం ఎదురు చూస్తున్న విషయాన్ని ఆయన అసలు గుర్తించడం లేదు అంటూ తన సన్నిహితులతో వాపోతున్నాడట. మరోపక్క ‘హరి హర వీరమల్లు’ నిర్మాత ఏఏం రత్నం పరిస్థితి కూడా ఇంతే. విడుదల తేదీ ప్రకటించుకొని కూర్చున్నాడు, పవన్ కళ్యాణ్ నాలుగు రోజుల డేట్స్ ఇచ్చేస్తే, మార్చి 10 లోపు షూటింగ్ పూర్తి చేసి, 28న విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనోడు డేట్స్ ఇస్తే కదా..ఇక ఎంత కాలం పాపం ఆ నిర్మాతలను, దర్శకులను పవన్ కళ్యాణ్ మానసికంగా వేధించుకొని తింటాడో చూడాలి.