Rahul Gandhi enters Bihar elections : రాహుల్ గాంధీ ఎట్టకేలకు రెండు నెలల తర్వాత బయటకొచ్చాడు. సెప్టెంబర్ 1వ తేదీన బీహార్ లో చివరిసారిగా చూశాం. ఓటు అధికార యాత్రలో భాగంగా అక్కడ కనిపించారు. ఆ యాత్రతో కాంగ్రెస్ లో జోష్ వచ్చింది. అది కొనసాగితే కాంగ్రెస్ పరిస్థితి బెటర్ అయ్యేది. బీహార్ లో కాంగ్రెస్ బలపడింది. తర్వాత రెండు నెలలు మాయమయ్యాడు. ఎటుపోయాడో తెలియదు. దీంతో కాంగ్రెస్ మేనియా బీహార్ లో పడిపోయింది.
తిరిగి తాజాగా రాహుల్ గాంధీ ఇప్పుడు ప్రచారానికి వచ్చాడు. అంటే మొక్కుబడిగా వచ్చినట్టే కదా. నా మాట వినలేదు తేజస్వి యాదవ్ అని రాహుల్ మథన పడుతున్నట్టు కనిపిస్తోంది. తేజస్వి యాదవ్ కాంగ్రెస్ మాట వినకుండా సీట్లు ప్రకటించి సొంతంగా ప్రచారం చేయడంతో రాహుల్ కినుక వహించి మాయమయ్యాడు.
బీహార్ లో కాంగ్రెస్ 61 సీట్లలో పోటీచేస్తోంది. కొన్ని ఫ్రెండ్లీ పోటీ నెలకొంది. 11 చోట్ల ఒకరిపై ఒకరు పోటీచేస్తున్నారు. అన్ని పార్టీల్లోకి కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక దరిద్రంగా ఉంది. టికెట్లు అమ్ముకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచే పరిస్థితి లేదట..

ఇప్పటికీ 11 చోట్ల ఇండీ కూటమి ఒకరిపై ఒకరు పోటీ.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.