OG Collection Day 5: సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో పవన్ కళ్యాణ్ మొదటి స్థానంలో ఉంటాడు… ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తూనే ముందుకు దూసుకెళ్తున్నాడు… ఇక రీసెంట్ గా ఆయన చేసిన ‘ఓజీ’ సినిమా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరికి మెప్పిస్తూ ముందుకు దూసుకెళ్తుంది… ఇప్పటివరకు ఈ సినిమా 350 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టింది. ఓజీ సినిమాతో పవన్ కళ్యాణ్ కి పాన్ ఇండియాలో గొప్ప క్రేజ్ దక్కింది. ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉంటుందని సినిమా చివర్లో అనౌన్స్ చేశారు. ఈ సినిమా దెబ్బకి ప్రస్తుతం పాన్ ఇండియా మొత్తం షేక్ అవుతోంది. ముఖ్యంగా సుజీత్ ఈ సినిమాలో తన మేకింగ్ తో ప్రేక్షకులందరికి తన వైపు తిప్పుకున్నాడు. గతంలో సుజీత్ బాలీవుడ్ స్టార్ హీరోతో సినిమా చేయాల్సింది.
కానీ పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే అవకాశం రావడంతో బాలీవుడ్ హీరోను పక్కన పెట్టాడు…ఇక చాలా స్టైలిష్ మేకింగ్ తో ఈ సినిమాని తెరకెక్కించిన సుజీత్ ని చూసిన ప్రతి ఒక్కరు ఇలాంటి సినిమా మాకు పడితే బాగుండేది అంటూ హీరోలందరు అనుకుంటుంటడటం విశేషం…
ఇక ఇలాంటి క్రమంలోనే సుజీత్ కి భారీ క్రేజ్ దక్కింది. ఇప్పుడు సుజిత్ డైరెక్షన్లో నటించడానికి చాలామంది హీరోలు ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం… ఇక ఈ సినిమాల లాంగ్ రన్ లో ఎంతటి కలెక్షన్స్ ని రాబడుతాయి. తద్వారా ఈ సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తోంది అనేది తెలియాల్సి ఉంది…
పవన్ కళ్యాణ్ ఎంటైర్ కెరియర్ లో మార్షల్ ఆర్ట్స్ కి సంబంధించిన గప్ లెంత్ సినిమా రాలేదు. గతంలో కిక్ బాక్సింగ్, కరాటే కి సంబంధించిన సినిమాలు వచ్చినప్పటికి ఒక జపనీస్ నేపథ్యంతో సినిమాని కనెక్ట్ చేస్తూ ఒక గొప్ప కథతో వచ్చిన సినిమాలు చాలా తక్కువ…ఈ సినిమా పవన్ కళ్యాణ్ లో ఉన్న పోటెన్షియాలిటిని బయటికి తీసి ఆయన అభిమానుల్ని ఉత్సాహానికి గురిచేస్తోంది..