Sobhita Dhulipala: అక్కినేని నాగ చైతన్య(Akkineni Naga Chaitanya) ని పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు బాగా దూరంగా ఉంటూ వస్తున్న శోభిత(Sobhita Dhulipala), ఇప్పుడు మళ్లీ హీరోయిన్ గా వరుస సినిమాలతో బిజీ కాబోతుంది. పెళ్లికి ముందు ఈమె చేసిన కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లు ఈమధ్యనే విడుదల అయ్యాయి కానీ, అవి అనుకున్నంత సక్సెస్ కాలేదు. ఇక పెళ్ళయాక ఈమె సినిమాలకు దూరంగా ఉంటుందని అనుకున్నారు, అంతే కాదు ఈమె గర్భం దాల్చింది అంటూ వార్తలు కూడా వినిపించాయి. అయితే అదంతా కేవలం రూమర్స్ మాత్రమే అని ఈమె రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది. తానూ ఇప్పటికీ సినిమాలు చేయడానికి సిద్దంగానే ఉన్నానని, నాగ చైతన్య నాకు ఎలాంటి పరిమితులు పెట్టలేదని చెప్పుకొచ్చింది. అందులో భాగంగానే ఆమె రీసెంట్ గానే ఆమె ఒక హిందీ సినిమా షూటింగ్ లో పాల్గొంది.
రీసెంట్ గా ఈమె ప్రముఖ దర్శకుడు PA రంజిత్ తెరకెక్కిస్తున్న ‘వెట్టువం’ అనే చిత్రం లో హీరోయిన్ క్యారక్టర్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచింది. ఈ విషయాన్నీ ఆ మూవీ టీం రీసెంట్ గానే అధికారికంగా ప్రకటించింది. ఇందులో హీరోగా దినేష్ నటిస్తుండగా, యంగ్ హీరో ఆర్య కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. PA రంజిత్ సినిమాలు అంటే ఎలా ఉంటాయో గతంలో మనం చూసాము. చాలా కొత్త రకంగా ఉంటాయి. ఆయన యూనివర్స్ వేరు. వెనుకబడిన సామజిక వర్గాలకు అండగా ఉండేలాగానే ఆయన సినిమాలు ఉంటాయి. కొన్ని సూపర్ హిట్ అయ్యాయి,మరికొన్ని డిజాస్టర్ ఫ్లాప్స్ అయ్యాయి, కానీ రంజిత్ కి మాత్రం మంచి పనితనం తెల్సిన డైరెక్టర్ అనే పేరు మాత్రం బలంగా ఉంది. అలాంటి డైరెక్టర్ సినిమాలో హీరోయిన్ క్యారక్టర్ చేయడానికి శోభిత ఒప్పుకుందంటే కచ్చితంగా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రనే అయ్యి ఉంటుందని అంచనా వేస్తున్నారు నెటిజెన్స్. ఇకపై కూడా ఆమె ఇలాంటి పాత్రలే చేస్తుందని ఆశిస్తున్నారు.
పెళ్ళికి ముందు బాలీవుడ్ లో ఈమె చేసిన సినిమాలు, వెబ్ సిరీస్ లు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. లిప్ లాక్ సన్నివేశాల్లో విచ్చలవిడిగా నటించేది. ఎన్నో బోల్డ్ సన్నివేశాలు చేసేది. అలాంటివి ఈసారి చేయకుండా ఉంటే చాలని అక్కినేని అభిమానులు కోరుకుంటున్నారు. ఆమె కూడా పెళ్లి తర్వాత పద్దతి గల పాత్రలు చేయడానికి ప్రాముఖ్యత చూపిస్తుందని PA రంజిత్ సినిమాని ఒప్పుకున్నప్పుడే ఒక క్లారిటీ వచ్చేసింది. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈమె ఇంకా ఎలాంటి సినిమాల్లో నటించబోతుంది అనేది. ఇక నాగచైతన్య విషయానికి వస్తే ఈ ఏడాది ‘తండేల్’ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకున్న నాగ చైతన్య, ఇప్పుడు విరూపాక్ష ఫేమ్ కార్తీక్ తో మిస్టిక్ థ్రిల్లర్ జానర్ లో ఒక సినిమా చేస్తున్నాడు.