OG movie : #OG ఫ్లాష్ బ్యాక్ లో అకిరా నందన్..17 ఏళ్ళ కుర్రాడిగా పవర్ ఫుల్ రోల్!

ఈ పాత్ర కోసం పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ అయితే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నాడట డైరెక్టర్ సుజిత్. పవన్ కళ్యాణ్ కెరీర్ లో భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ యాక్షన్ చిత్రం కాబట్టి,

Written By: NARESH, Updated On : May 2, 2023 10:42 pm
Follow us on

OG movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో ప్రస్తుతం నటిస్తున్న సినిమాలలో #OG మూవీ మీద ఉన్న హైప్ మామూలుది కాదు. కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఆడియన్స్ కూడా ఈ చిత్రం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దానికి తోడు డీవీవీ దానయ్య ఎంటర్టైన్మెంట్స్ సంస్థ పవన్ కళ్యాణ్ కి సంబంధించిన షూటింగ్ లొకేషన్స్ ఫోటోలను అప్లోడ్ చేస్తూ అభిమానుల్లో ఉన్న హైప్ ని వంద రెట్లు ఎక్కువ చేస్తున్నారు.

మొదటి షెడ్యూల్ పూర్తి అయిన నేపథ్యం లో నేడు ఈ ట్విట్టర్ లో విడుదల చేసిన ఒక ఫోటో సోషల్ మీడియా లో సెన్సేషనల్ గా మారింది, మిగిలిన హీరోలకు ఫస్ట్ లుక్ విడుదలైనప్పుడు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో, #OG మూవీ కి కేవలం వర్కింగ్ స్టిల్స్ కి అలాంటి రెస్పాన్స్ వస్తుంది. దీనిని బట్టీ అర్థం చేసుకోవచ్చు ఈ సినిమాకి ఉన్న హైప్ ఎలాంటిదో.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన రెండవ షెడ్యూల్ పూణే లో జరుగుతుంది, ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ మరియు హీరోయిన్ ప్రియాంక మోహన్ పై ఒక సాంగ్ ని చిత్రీకరిస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించి మరో క్రేజీ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియా ని ఒక ఊపు ఊపేస్తోంది. అదేమిటంటే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ 17 ఏళ్ళ వయస్సు లో ఉన్నప్పుడు ఎదురుకున్న సంఘటనలను షూట్ చెయ్యబోతున్నారు.

ఈ పాత్ర కోసం పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ అయితే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నాడట డైరెక్టర్ సుజిత్. పవన్ కళ్యాణ్ కెరీర్ లో భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ యాక్షన్ చిత్రం కాబట్టి, ఇదే అకిరా నందన్ కి సరైన లాంచింగ్ అయ్యే సినిమా అవుతుందని డైరెక్టర్ సుజిత్ ఆలోచిస్తున్నాడట.మరి ఇందుకు పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటాడా లేదా అనేది చూడాలి.