OG Movie 6 Days Collections: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఓజీ(They Call Him OG) చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో ముందుకు దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. నిన్నటితో ఈ చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ కలెక్షన్స్ ని దాటి, ఈ ఏడాది అత్యధిక వసూళ్లను రాబట్టిన నెంబర్ 1 చిత్రంగా నిల్చింది. నేడు సాయంత్రం నుండి ప్రతీ సెంటర్ లోనూ ఈ చిత్రం విశ్వరూపం చూపే అవకాశాలు ఉన్నాయి. ఇక బ్రేక్ ఈవెన్ విషయానికి వస్తే, ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఆరు రోజుల్లో 90 శాతం కి పైగా రీకవరీ అయ్యింది. మిగిలిన పది శాతం ఈ వీకెండ్ తో బ్రేక్ ఈవెన్ అయిపోతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఆదివారం నుండి వచ్చే వసూళ్లు మొత్తం లాభాలే అట. ఆరవ రోజున ఎంత వసూళ్లు వచ్చాయో ప్రాంతాల వారీగా ఒకసారి చూద్దాం.
నైజాం ప్రాంతం లో రిటర్న్ జీఎస్టీ తో కలిపి కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, కృష్ణ జిల్లాలో 30 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 31 లక్షలు, గుంటూరు జిల్లాలో 31 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 29 లక్షలు, నెల్లూరు జిల్లాలో 20 లక్షలు, ఉత్తరాంధ్ర లో 51 లక్షలు, సీడెడ్ లో 55 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఆరవ రోజున 3 కోట్ల 47 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ప్రీ ఫెస్టివల్ కి ముందు ఈ రేంజ్ స్టడీ రన్ ఈమధ్య కాలం లో ఏ సినిమాకు కూడా చూడలేదని ట్రేడ్ పండితులు అంటున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు,ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రం ఆరవ రోజున కోటి 70 లక్షల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. 5 వ రోజుకంటే రెండింతలు ఎక్కువ వసూళ్లు అన్నమాట.
ఓవరాల్ గా చూసుకుంటే ఈ చిత్రానికి ఆరవ రోజున 11 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 6 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా 6 రోజులకు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 153 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 250 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓవర్సీస్ లో అయితే గ్రాస్ పరంగా ఈ చిత్రం 70 కోట్ల వరకు చేరిందని సమాచారం, నైజాం లో కూడా ఈ వీకెండ్ తో వంద కోట్ల గ్రాస్ మార్కుని ఈ చిత్రం అందుకుంటుందని అంటున్నారు. అయితే ఉత్తరాంధ్ర, సీడెడ్,నెల్లూరు ప్రాంతాల్లో మాత్రం ఈ సినిమా ఆశించిన స్థాయిలో పెర్ఫార్మ్ చేయడం లేదనే చెప్పాలి. ఈ మూడు ప్రాంతాల్లో స్వల్పంగా నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మూడవ వారం లో రన్ వస్తే బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.