Akhira Nandan OG movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవ్వరికి దక్కనటువంటి గొప్ప క్రేజ్ ను సంపాదించుకున్న నటుడు పవన్ కళ్యాణ్… ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టాయి… ప్రస్తుతం పాన్ ఇండియాలో పలు రికార్డులను బ్రేక్ చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న ఓజీ సినిమా ఇప్పటివరకు 300 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తన నట విశ్వరూపాన్ని చూపించడమే కాకుండా తన స్వాగ్ ను చూపిస్తూ ఒకప్పటి వింటేజ్ పవన్ కళ్యాణ్ ని బయటకు తీసుకొచ్చాడు. దాంతో ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది. ఈ సినిమా కోసం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ది బెస్ట్ విజువల్స్ తో సినిమాను తీయడం వల్ల ఆయన కూడా టాప్ డైరెక్టర్ గా ఎదిగాడు. మొత్తానికైతే ఈ సినిమాతో సుజీత్ పాన్ ఇండియాను షేక్ చేశాడు…
ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కొడుకు అయిన అఖిరా నందన్ కూడా ఉన్నాడు అంటూ ముందు కొన్ని ప్రచారాలైతే జరిగాయి. అయినప్పటికి ఈ సినిమాలో మాత్రం అఖిరా నందన్ ఉండకపోవడంతో పవన్ కళ్యాణ్ ప్యాన్స్ అందరు నిరాశ చెందారు. పవన్ కళ్యాణ్ చిన్నప్పటి క్యారెక్టర్ అఖిరా నందన్ చేసి ఉంటే బాగుండేది కదా! ఆ క్యారెక్టర్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంది.
కాబట్టి అఖిరానందన్ చేస్తే దానికి ప్రత్యేకమైన గుర్తింపు వచ్చేది. అలాగే కూడా సినిమా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయినట్టుగా ఉండేది అంటూ కొంతమంది అభిమానులు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికి సినిమా యూనిట్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అకిరానందన్ హైట్ కి పవన్ కళ్యాణ్ హాట్ కి మధ్య చాలా చేంజ్ ఉంది.
కాబట్టి వీళ్ళిద్దరి మధ్య హైట్ కంటిన్యూటి మిస్టేక్స్ వస్తాయనే ఉద్దేశ్యంతోనే అఖిరా నందన్ ను పక్కనపెట్టి వేరే అబ్బాయితో ఆ క్యారెక్టర్ చేయించినట్టుగా చిత్ర యూనిట్ నుంచి కొన్ని అభిప్రాయాలైతే వెలవడుతున్నాయి. ఇక ఇది చైనా అచల మంది హైట్ ఎక్కువగా తక్కువగా ఉందనేది మ్యాటర్ కాదు. చీట్ చేసి అఖిరా నందన్ హైట్ తక్కువ గా చూపించవచ్చు. లేదంటే పవన్ కళ్యాణ్ హైట్ ఎక్కువగా ఉన్నట్టు చూపించవచ్చు. దానికోసం అఖిరా నందన్ ను సినిమాలో పెట్టలేదు అనేది సరైన సమాధానం కాదు అంటూ వాళ్ళ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తుండటం విశేషం…