OG Movie 5 days Collections: నిన్న గాక మొన్న విడుదలైనట్టు అనిపిస్తున్న పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఓజీ(They Call Him OG) చిత్రం అప్పుడే 5 రోజులు పూర్తి చేసుకొని, 6వ రోజు లోకి అడుగుపెట్టింది. మొదటిరోజు ఏకంగా #RRR, పుష్ప 2 రికార్డ్స్ ని బద్దలు కొట్టి పవన్ కళ్యాణ్ సత్తా ని ప్రపంచం మొత్తం చాటిన ఈ చిత్రం, వీకెండ్ లో కూడా అదే జోరు ని కొనసాగిస్తూ దాదాపుగా 150 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. అంతకు ముందు పవన్ కళ్యాణ్ పై వంద కోట్ల రూపాయిల షేర్ సినిమా లేదని సోషల్ మీడియా లో యాంటీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ట్రోల్ చేసేవారు. అలాంటి వాళ్లకు మొదటి రోజే 90 కోట్లకు పైగా షేర్ వసూళ్లను రాబట్టి, వీకెండ్ లోనే 150 మార్కుని అందుకొని, ఎందుకు అందరూ తనని ఓపెనింగ్స్ కింగ్ అని పిలుస్తారో చెప్పకనే చెప్పాడు పవన్ కళ్యాణ్.
భారీ లాంగ్ వీకెండ్ తర్వాత ఏ సినిమా అయిన డౌన్ అవుతుందని అందరూ అంటూ ఉంటారు. కానీ ఈ చిత్రం వీకెండ్ తర్వాత కూడా డౌన్ అవ్వలేదు. అద్భుతమైన హోల్డ్ ని చూపిస్తూ 5 వ రోజున రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ప్రాంతాల వారీగా 5 వ రోజున వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే, నైజాం ప్రాంతం లో కోటి 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, సీడెడ్ ప్రాంతం నుండి 85 లక్షలు, ఉత్తరాంధ్ర ప్రాంత నుండి 65 లక్షలు వచ్చాయి. అదే విధంగా ఉభయ గోదావరి జిల్లాలు మరియు కృష్ణ జిల్లా కలిపి 94 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు, గుంటూరు జిల్లా కలిపి 34 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక నెల్లూరు జిల్లాలో అయితే అనూహ్యంగా ఈ సినిమాకు 18 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
ఓవరాల్ గా రిటర్న్ జీఎస్టీ తో కలిపి 5 వ రోజున 5 కోట్ల రూపాయిల వరకు షేర్ వసూళ్లు వచ్చాయి . దీంతో ఈ చిత్రం 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 156 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టిన సినిమాగా నిల్చింది. ఈ వీకెండ్ పండుగ వీకెండ్ అవ్వడం తో పూర్తి స్థాయిలో బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి, క్లీన్ హిట్ స్టేటస్ ని సొంతం చేసుకొని, భారీ లాభాలను రాబడుతుందని బలమైన నమ్మకంతో ఉన్నారు ట్రేడ్ పండితులు. మరి ఆ రేంజ్ కి ఈ చిత్రం వెళ్తుందో లేదో చూడాలి.