OG Movie Collection: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘ఓజీ'(They Call Him OG) చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రాబడుతున్న వసూళ్లు ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపోయేలా చేస్తూ ముందుకు దూసుకుపోతుంది. మొదటి రోజు అక్షరాలా 154 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా రెండవ రోజు కూడా మంచి వసూళ్లను నమోదు చేసుకుంది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం రెండవ రోజు ఈ చిత్రానికి దాదాపుగా 40 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కేవలం ఆంధ్ర ప్రదేశ్ నుండి 15 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు, ఓవరాల్ వరల్డ్ వైడ్ గా 20 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు ఉండొచ్చని అంచనా. హిందీ లో మొదటి రోజు తో పోలిస్తే రెండవ రోజు వచ్చిన వసూళ్లు 70 శాతం ఎక్కువ ఉన్నాయని టాక్. ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లు వచ్చాయో ఒకసారి వివరంగా చూద్దాం.
రెండవ రోజున నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి 7 కోట్ల 88 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. మిడ్ వీక్ లో, దసరా సెలవులకు ముందు ఈ రేంజ్ షేర్ వసూళ్లు రావడం అనేది చిన్న విషయం కాదు. సాధారణంగా ప్రీ దసరా సీజన్ సినిమాలకు చాలా డల్ గా ఉంటుందని ట్రేడ్ విశ్లేషకులు అంటూ ఉంటారు. కానీ ఈ సినిమా వాళ్ళ అంచనాలను మించి రెండవ రోజు కలెక్షన్స్ ని హోల్డ్ చేయడం గమనార్హం. ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే తూర్పు గోదావరి జిల్లాలో 62 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకు, పశ్చిమ గోదావరి జిల్లా నుండి 55 లక్షలు, ఉత్తరాంధ్ర నుండి కోటి 25 లక్షలు, రాయలసీమ ప్రాంతం నుండి కోటి 50 లక్షలు, కృష్ణ జిల్లా నుండి 74 లక్షలు, గుంటూరు జిల్లా నుండి 64 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో రిటర్న్ GST తో కలిపి ఈ చిత్రానికి రెండవ రోజున 15 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. వరల్డ్ వైడ్ గా రెండు రోజులకు కలిపి 110 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, వీకెండ్ కి కచ్చితంగా 140 నుండి 150 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వస్తాయని అంటున్నారు. నేడు, రేపు వీకెండ్ అవ్వడం తో పాటు దసరా సెలవులు బాగా కలిసొచ్చి కచ్చితంగా ఈ చిత్రం అత్యధిక సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అదే కనుక జరిగితే 12 ఏళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ నుండి వచ్చిన క్లీన్ బ్లాక్ బస్టర్ గా ఈ చిత్రం నిలుస్తుంది. చూడాలి మరి ఫుల్ రన్ ఎంత వరకు వెళ్లి ఆగుతుంది అనేది.