Chiranjeevi Birthday OG: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులకు ‘ఓజీ'(They Call Him OG) చిత్రం ఒక ఎమోషన్ లాగా మారిపోయింది. ఈ చిత్రం తో అభిమానులు పవన్ కళ్యాణ్ పూర్వ వైభవాన్ని చూస్తాము అనే ధీమాలో ఉన్నారు. ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి విడుదలైన ప్రతీ కంటెంట్ చాలా క్రేజీ గా ఉంది. ముందుగా 2023 వ సంవత్సరం లో ఈ చిత్రం నుండి ఒక గ్లింప్స్ వీడియో వచ్చింది. ఈ గ్లింప్స్ దేశవ్యాప్తంగా సృష్టించిన ప్రకంపనలు సాధారణమైనవి కావు. ఎన్ని సార్లు చూసిన మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపించే రేంజ్ లో డైరెక్టర్ సుజిత్ ఈ గ్లింప్స్ ని కట్ చేశాడు. థియేటర్ లో ఈ గ్లింప్స్ వీడియో ఎప్పుడొచ్చినా థియేటర్ బద్దలు అయిపోయే రేంజ్ లో రెస్పాన్స్ వస్తుంది. ఇది వరకు ఇలాంటి రెస్పాన్స్ వీడియోస్ సోషల్ మీడియా లో మనం వందలకొద్దీ చూశాము. ఇక రీసెంట్ గా విడుదలైన ‘ఫైర్ స్ట్రోమ్’ పాట అయితే మ్యూజిక్ లవర్స్ ని మెంటలెక్కిపోయేలా చేసింది.
యూట్యూబ్, యూట్యూబ్ మ్యూజిక్, జియో సావన్, స్ఫోటి ఫై ఇలా అన్ని మ్యూజిక్ యాప్స్ లో ఈ పాట కి వస్తున్నా వ్యూస్ ని చూసి అభిమానులు మెంటలెక్కిపోతున్నారు. చాలా కాలం తర్వాత ఒక పవన్ కళ్యాణ్ సినిమా పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది అంటూ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. అయితే ఆగష్టు 15 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ టీజర్ వస్తుందేమో అని అంతా అనుకున్నారు. మేకర్స్ కూడా అదే విడుదల చెయ్యాలని అనుకున్నారు కానీ, థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ సమయానికి ఇవ్వకపోవడం వల్ల సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ యాక్షన్ టీజర్ ని వాయిదా వేశారు. అయితే ఈ చిత్రం నుండి తదుపరి వచ్చేది మెలోడీ సాంగ్ అని రీసెంట్ గానే మేకర్స్ అధికారికంగా హీరోయిన్ ప్రియాంక మోహన్ ఫస్ట్ లుక్ ద్వారా ఖరారు చేశారు.
శ్రేయా ఘోషల్ గాత్రం అందించిన ఈ పాటకు సంబంధించిన ప్రోమో ని నేడు ఎదో ఒక సమయం లో విడుదల చేసే అవకాశం ఉంది. పూర్తి పాట మాత్రం మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) పుట్టినరోజు సందర్భంగా ఆగష్టు 22 న విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. నేడు విడుదల అవ్వబోయే ప్రోమో లోనే ఈ అప్డేట్ ఉంటుందని అంటున్నారు. ఇకపోతే ఈ మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టిన రోజు సందర్భంగా, ఆయన సోదరుడు నాగబాబు నిర్మించిన ‘స్టాలిన్’ చిత్రాన్ని మరోసారి గ్రాండ్ గా రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ కంటెంట్లు మొత్తం జత చేసి విడుదల చేస్తున్నారట. అదే విధంగా రామ్ చరణ్ పెద్ది మూవీ గ్లింప్స్ వీడియో ని కూడా ఈ చిత్రం తో జత చేస్తున్నట్టు సమాచారం. మెగా ఫ్యాన్స్ కి ఈ నెల 22న థియేటర్స్ లో విజువల్ ఫీస్ట్ అనే చెప్పాలి.