DSC Merit List Release: ఉపాధ్యాయ నియామకాల కు సంబంధించి ఏపీ ప్రభుత్వం( AP government) కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే డీఎస్సీ ఫలితాలను వెల్లడించింది. మరోవైపు రేపు మెరిట్ లిస్టు జారీకి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. టిడిపి కూటమి అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ ప్రకటిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా ఆ హామీ ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే అధికారంలోకి వచ్చిన వెంటనే డీఎస్సీ తొలి ఫైల్ పై సంతకం చేశారు. అన్ని రకాల ప్రక్రియను పూర్తి చేసి 16,400 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు. ఆన్లైన్లో పరీక్షల నిర్వహణ కూడా పూర్తయింది. కొద్ది రోజుల కిందటే ఫలితాలను ప్రకటించారు. రేపు మెరిట్ లిస్ట్ జారీ చేయనున్నారు.
Also Read: ఏపీ మెగా డీఎస్సీ ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి..!
మెరిట్ లిస్ట్ కీలకం..
డీఎస్సీ నియామకంలో మెరిట్ లిస్ట్( merit list) అనేది కీలకం. ఆ జాబితాను రేపు విడుదల చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇప్పటికే టెట్ మార్కుల సవరణపై పలుమార్లు అభ్యంతరాలు స్వీకరించింది పాఠశాల విద్యాశాఖ. క్రీడల కోటాకు సంబంధించిన జాబితా కూడా రావడంతో సర్టిఫికెట్ల పరిశీలనకు సిద్ధమవుతోంది. అందుకే మెరిట్ లిస్ట్ గారికి నిర్ణయించింది. సర్టిఫికెట్ల ఎంపిక జాబితా అంటే దాదాపు ఉద్యోగాలు పొందినట్టే. మొత్తం 16347 పోస్టులు భర్తీ చేస్తుండగా.. అంతే సంఖ్యలో అభ్యర్థులను సర్టిఫికెట్ల పరిశీలనకు పిలవనున్నారు. వారిలో ఎవరివైనా సర్టిఫికెట్లు సక్రమంగా లేకపోతే.. ఆ సంఖ్యకు సమానంగా తర్వాత మెరిట్ జాబితాలో ఉన్న అభ్యర్థులను పిలుస్తారు.
Also Read: నిరుద్యోగులకు అలెర్ట్ : మెగా డీఎస్సీ 2025 పై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
అభ్యర్థులకు కాల్ లెటర్లు..
మెరిట్ లిస్ట్ ప్రకారం అభ్యర్థులను సర్టిఫికెట్ల పరిశీలనకు( certificates verification) పిలవనున్నారు. అలా పరిశీలన పూర్తయిన తర్వాత ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేయనున్నారు. అయితే మొన్న ఫలితాలను ప్రకటించారు. కానీ ఉద్యోగాలు ఎవరికి దక్కాయో అన్నది స్పష్టత ఉండదు. ఒకవేళ మెరిట్ జాబితా విడుదల చేస్తే దీనిపై కొంత స్పష్టత వస్తుంది. అందుకే ఈ మెరిట్ లిస్ట్ కోసం అభ్యర్థులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మెరిట్ జాబితాతో ఉద్యోగాలు వచ్చినట్టు కాదని.. తుది జాబితా ప్రకటించిన తర్వాతే ఉద్యోగాలు కన్ఫర్మ్ అని చెబుతున్నారు. రేపు కానీ మెరిట్ లిస్ట్ ప్రకటిస్తే… సర్టిఫికెట్ల పరిశీలనకు అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపించమన్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో జాబితాలను సిద్ధం చేసి.. రెండో వారంలో పోస్టింగులు ఇవ్వాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.