OG created history: ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన ‘ఓజీ'(They Call Him OG) చిత్రం థియేటర్స్ లో ఏ రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో, ఓటీటీ లో కూడా అదే రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. రెండు వారాల క్రితం నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ చిత్రానికి ఓటీటీ ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ అటు సోషల్ మీడియా మొత్తం ఓజీ మూవీ షాట్స్ తో నింపేస్తున్నారు. కేవలం తెలుగు ఆడియన్స్ మాత్రమే కాదు, హిందీ, తమిళం మరియు మలయాళం ఆడియన్స్ కూడా ఈ చిత్రాన్ని చూసి మెంటలెక్కిపోతున్నారు. ఒక హీరో ని ఎలివేట్ చేస్తూ ఈ రేంజ్ సన్నివేశాలు ఇప్పటి వరకు ఇండియన్ సినీ ఇండస్ట్రీ హిస్టరీ నేటి తరం లో ఎవరికీ పడలేదని, సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత అలాంటి ఎలివేషన్స్ పవన్ కళ్యాణ్ కి మాత్రమే పడ్డాయని అంటున్నారు.
ఇలా ఓటీటీ లో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడం తో మొదటి వారం 32 లక్షల వ్యూస్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం, రెండవ వారం 30 లక్షల వ్యూస్ ని సొంతం చేసుకుంది. మొత్తం మీద రెండు వారాల్లో 62 లక్షల వ్యూస్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం కోటి వ్యూస్ వైపు పరుగులు తీస్తోంది. ప్రస్తుతం ఆల్ ఇండియా వైడ్ గా టాప్ 2 స్థానం లో కొనసాగుతున్న ఓజీ చిత్రం, మరో రెండు మూడు వారాలు ఇదే రేంజ్ లో కొనసాగితే, కచ్చితంగా 15 మిలియన్ కి పైగా వ్యూస్ ని ఈ చిత్రం సొంతం చేసుకుంటుందని అంటున్నారు విశ్లేషకులు. కానీ ఫుల్ రన్ లో ఈ చిత్రం ఇప్పుడు #RRR రికార్డు ని అందుకుంటుందా లేదా అనేది అనేదే ఇప్పుడు ప్రశ్న. #RRR చిత్రానికి నెట్ ఫ్లిక్స్ లో దాదాపుగా 43 మిల్లియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.
ఇక ఆ తర్వాత కల్కి, సలార్, లక్కీ భాస్కర్, దేవర వంటి చిత్రాలు ఉన్నాయి. వీటిల్లో ఓజీ చిత్రం ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే దేవర ని అవలీలగా దాటే అవకాశాలు ఉన్నాయి కానీ, లక్కీ భాస్కర్ మరియు సలార్ చిత్రాలను దాటడం కాస్త కష్టమే అని చెప్పాలి. కానీ ఫుల్ రన్ లో నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చే సినిమాల బట్టి, ఓజీ ఓటీటీ రన్ ఆధారపడి ఉంటుంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా రేంజ్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది.