Pawan Kalyan OG Movie : పవన్ కళ్యాణ్(Deputy Cm Pawan Kalyan) ‘ఓజీ’ చిత్రం గురించి సోషల్ మీడియా లో ప్రతీ రోజు ఎదో ఒక వార్త చక్కర్లు కొడుతూనే ఉంది. ఈ నెల 25 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ నేపథ్యం లో ఫ్యాన్స్ ఈ సినిమా ని కనీవినీ ఎరుగని రీతిలో సెలబ్రేట్ చేసుకోవాలని చూస్తున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి. రేపు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఒక చిన్న గ్లింప్స్ వీడియో ని విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన గ్లింప్స్ వీడియో మరియు రెండు లిరికల్ వీడియో సాంగ్స్ కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఎక్కడ చూసిన పగ రగిలే ఫైర్ పాట నే వినిపిస్తుంది. ఇన్ స్టాగ్రామ్ లో అప్పుడే ఈ పాట పై 40 వేలకు పైగా రీల్స్ వచ్చాయి.
ఇకపోతే రేపు విడుదల చేయబోయే గ్లింప్స్ వీడియో లో పవన్ కళ్యాణ్ తో పాటు విలన్ గా నటించిన ఇమ్రాన్ హష్మీ కూడా ఉండబోతున్నాడు. 45 నుండి 60 సెకండ్ల నిడివి ఉన్నటువంటి ఈ గ్లింప్స్ వీడియో సోషల్ మీడియా లో ప్రకంపనలు సృష్టిస్తాయని, సినిమా మీద ఉన్న హైప్ ని పదింతలు పెంచుతుందని అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా క్లైమాక్స్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. ఈమధ్య కాలం లో విడుదల అవుతున్న ప్రతీ పాన్ ఇండియన్ సినిమాలోనూ క్లైమాక్స్ లో పార్ట్ 2 సంబంధించిన క్లిఫ్ హ్యాంగర్ వంటివి పెడుతున్నారు. కానీ ఈ సినిమా క్లైమాక్స్ మాత్రం చాలా ఎమోషనల్ గా ఉండబోతుంది అట. థియేటర్ లో కూర్చున్న ఆడియన్స్ కన్నీళ్లు పెట్టుకోక తప్పదట. అంత గొప్ప ఎమోషనల్ సన్నివేశం తో సినిమా ముగుస్తుందని అంటున్నారు.
ఇంతకీ ఏంటి ఆ ఎమోషనల్ సీన్?, గ్యాంగ్ స్టర్ మూవీ లో , అది కూడా క్లైమాక్స్ లో ఇంత ఎమోషనల్ సన్నివేశం ఉండడం ఏంటి?, అసలు డైరెక్టర్ సుజీత్ ఏమి ప్లాన్ చేశాడంటూ అభిమానులు జుట్టు పీక్కుంటున్నారు. ఒకవేళ హీరో క్యారక్టర్ ని చంపేసే టైపు లో క్లైమాక్స్ ఉంటే ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో అని సోషల్ మీడియా లో అభిమానులు చర్చించుకుంటున్నారు. చూడాలి మరి ఆ క్లైమాక్స్ స్పెషల్ ఏంటి అనేది. ఇకపోతే రేపటి నుండి అభిమానులకు ప్రతీ రోజు ఓజీ పండగే అనే విధంగా ప్రొమోషన్స్ అభిమానులు చేస్తారని, మేకర్స్ కాస్త సహకరిస్తే రాజమౌళి సినిమాకు ఎలాంటి హైప్ జనాల్లో క్రియేట్ అవుతుందో, అలాంటి హైప్ ని తీసుకొస్తారట.