Anushka Shetty – Rana Daggubati : లేడీ సూపర్ స్టార్ గా పిలవబడే అనుష్క(Anushka Shetty) చాలా కాలం తర్వాత మన ముందుకు ఈ నెల 5వ తారీఖున ఘాటీ చిత్రం ద్వారా మన ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రొమోషన్స్ లో డైరెక్టర్ క్రిష్(Krish Jagarlamudi) ఇప్పటికే ఫుల్ బిజీ గా ఉన్నాడు. కానీ అనుష్క మాత్రం ప్రొమోషన్స్ కి రాలేనని చెప్పిందట. ఈ సినిమాకు మాత్రమే కాదు, ఆమె గత చిత్రం ‘మిస్ శెట్టి..మిస్టర్ పోలిశెట్టి’ మూవీ ప్రొమోషన్స్ కి కూడా రాలేదు. కానీ అప్పట్లో ఆమె వాయిస్ ఇంటర్వ్యూస్ ఇచ్చింది. ఇప్పుడు కూడా ఆమె అదే ఫార్మటు ని అనుసరిస్తుంది. ‘ఘాటీ'(Ghaati Movie) మూవీ ప్రొమోషన్స్ కోసం కెమెరా ముందుకు అయితే రాలేను కానీ, కెమెరా బయట మాత్రం ప్రొమోషన్స్ గట్టిగా చేస్తాను అనే సంకేతం ఇచ్చింది. అందులో భాగంగా ఆమె ప్రముఖ హీరో రానా దగ్గుబాటి(Rana Daggubati) తో జరిపిన ఒక ఫోన్ కాల్ సంభాషణ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ముందుగా రానా మాట్లాడుతూ ‘క్రిష్ నీతో యాక్షన్ చిత్రం చేసాడట కదా, చాలా వైల్డ్ గా చూపించాడట?’ అని అడుగుతాడు. అప్పుడు అనుష్క ‘అవును..ఇప్పుడే అదే అన్నాను..అరుంధతి, బాహుబలి తర్వాత నాలో అంతటి వయొలెంట్ యాంగిల్ చూపించారు అని’ అంటుంది అనుష్క. ఆమె మాట్లాడిన ఈ మాట ని బట్టి చూస్తే టీజర్ లో ఆమెను క్రిష్ ఎంత క్రూరంగా చూపించాడో మన అందరం చూసాము. ట్రైలర్ లో కూడా యాక్షన్ భారీగానే ఉంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలో ఈమధ్య కాలం లో ఇంత వయొలెన్స్ ఎప్పుడూ చూసి ఉండరని ఈ ఫోన్ కాల్ సంభాషణలో అనుష్క చెప్పుకొచ్చింది. ఇలాంటి యాక్షన్ చిత్రాలంటే నువ్వు కాకుండా ఇంకెవరు గుర్తుకొస్తారు అంటూ అనుష్క తో రానా మాట్లాడిన ఈ మాటలు బాగా వైరల్ అయ్యాయి.
సోషల్ మీడియాలో బాగా వైరల్ అయినటువంటి ఈ 6 నిమిషాల ఫోన్ కాల్ సంభాషణ ని మీరు కూడా వినేయండి. ఇకపోతే డైరెక్టర్ క్రిష్ ఈ చిత్రం మీద చాలా నమ్మకం తో ఉన్నాడు. సినిమా చాలా బాగా వచ్చిందని, పూర్తి స్థాయి ఫోకస్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించానని, ఇందులో అనుష్క నట విశ్వరూపం చూస్తారంటూ ఆయన రీసెంట్ గా జరిగిన ఒక మీడియా సమావేశం లో చెప్పుకొచ్చాడు. సెన్సార్ రిపోర్ట్స్ కూడా ఈ చిత్రానికి చాలా బాగున్నాయి. కచ్చితంగా ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకునే సినిమా అవుతుందని క్రిష్ బలంగా నమ్ముతున్నాడు. ఆయన గత చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఫస్ట్ హాఫ్ మొత్తం చిత్రీకరించింది ఆయనే. అక్కడి వరకు సినిమా చాలా బాగుంది అనే టాక్ కూడా వచ్చింది. కాబట్టి క్రిష్ మంచి ఫార్మ్ లోనే ఉన్నాడు, ఘాటీ పెద్ద హిట్ అవుతుందని బలమైన నమ్మకం తో ట్రేడ్ పండితులు ఉన్నారు.
#AnushkaShetty shares, “Audiences will see more of me in films in the coming days.”
A phone call between #RanaDaggubati and Anushka ahead of #Ghaati release. pic.twitter.com/D0ePMsekyT
— Gulte (@GulteOfficial) September 1, 2025