OG 2 Devara 2 Salaar 2: టాలీవుడ్ లో కొన్ని సినిమాలకు సీక్వెల్ అవసరం , కొన్ని సినిమాలకు అసలు అవసరం లేదు. కానీ ఈమధ్య కాలం లో కొంతమంది మేకర్స్ కేవలం హైప్ కోసం సినిమా ఎండింగ్ లో సీక్వెల్ ఉంటున్నట్టు ప్రకటిస్తున్నారు. వాటికి ఎలాంటి క్రేజ్ రాదు అనుకోండి , కానీ కొన్ని సినిమాలకు మాత్రం సీక్వెల్స్ కచ్చితంగా కావాలి. అలాంటి సినిమాల్లో ఒకటి ‘ఓజీ’. జపాన్ లోని సమురాయ్ వర్గానికి చెందిన ఒక యువకుడు , తన వర్గానికి చెందిన వాళ్లంతా చనిపోవడం తో , ముంబై కి సత్యా దాదా అనే వ్యక్తి కి అండగా నిలిచి అతనితో పాటు ముంబై కి వెళ్తాడు. అక్కడ సత్య దాదా పోర్ట్ ని నిర్మించాలనే సంకల్పానికి ఓజీ అండగా నిలుస్తాడు. ఒకరోజు ఆ పోర్ట్ లోకి పెద్ద కంటైనర్ వస్తుంది , ఆ కంటైనర్ లో ముంబై ని పేల్చేయడానికి అవసరమయ్యే బాంబులు ఉంటాయి.
వీటిని సత్య దాదా దాచేస్తాడు, అనంతరం విలన్ గ్యాంగ్ సత్య దాదా ని ఎలా అయినా టార్చర్ చేసి కంటైనర్ ని సొంతం చేసుకోవాలని అనుకోవడం, ఓజీ వాళ్ళ కుట్రలను భగ్నం చేయడం వంటివి మొదటి భాగం లో చూపించారు. అయితే ‘ఓజీ’ సత్య దాదా కొడుకు ని చంపాను అనే నిండని వేసుకొని ముంబై వదిలి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత జపాన్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఓజీ, మాస్టర్ ఓరోచీ గెంషిన్ గా ఎలా మారాడు?, యాకూజా సైన్యాన్ని మొత్తం ఎలా చంపాడు?, ఓజీ తండ్రి గతం ఏంటి?, నేతాజీ సుభాష్ చంద్రబోస్ తో ఉన్న కనెక్షన్ ఏంటి? వంటి అంశాలు ఓజీ ప్రీక్వెల్ లో చూపిస్తారు. అందుకే ఈ సినిమాకు ఈ రేంజ్ క్రేజ్ ఉంది. ఈ చిత్రానికి సీక్వెల్, ప్రీక్వెల్ ఎంత అవసరమో , ‘సలార్’ కి కూడా అంతే అవసరం.
ఈ రెండు చిత్రాలకు యూత్ ఆడియన్స్ లో ఉన్నటువంటి క్రేజ్ సాధారమైనది కాదు. అయితే ‘సలార్ 2’ ఉంటుందా అంటే అనుమానమే. ఎందుకంటే ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ‘డ్రాగన్’ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నాడు. ఈ ‘డ్రాగన్ ‘ సిరీస్ పూర్తి అయ్యాక , ఆయన ఈ జానర్ సినిమాలకు ఎండ్ కార్డు వేస్తానని ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు. దీంతో ‘సలార్ 2’ ఉంటుందా లేదా అనే అనుమానం ప్రేక్షకుల్లో కలిగింది. ఈ రెండు సినిమాలతో పాటు, నందమూరి అభిమానులు ‘దేవర 2’ కోసం కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సీక్వెల్ కి నందమూరి ఫ్యాన్స్ లో క్రేజ్ ఉండొచ్చేమో కానీ, నార్మల్ ఆడియన్స్ లో మాత్రం ఎలాంటి క్రేజ్ లేదు. కానీ ‘దేవర’ కథ ముగియలేదని మొదటి భాగం లోనే స్పష్టంగా చెప్పేసాడు కొరటాల శివ. మరి ఇప్పుడు ఆయన బాలయ్య సినిమాకు షిఫ్ట్ అయ్యాడు, ఎన్టీఆర్ కూడా డ్రాగన్ సిరీస్ తర్వాత ‘గాడ్ ఆఫ్ వార్’ చేయబోతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యం లో ‘దేవర 2’ ఉంటుందా అంటే అనుమానమే.

