OG Movie: ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘ఓజీ'(They Call Him OG) చిత్రం అభిమానులకు మిగిలించిన తీపి జ్ఞాపకాలు మామూలైవి కావు. విడుదలకు ముందు ఈ సినిమా యుఫొరియా ని ఒక రేంజ్ లో ఎంజాయ్ చేశారు. విడుదల తర్వాత ఈ చిత్రాన్ని ప్రతీ రోజు సెలబ్రేట్ చేసుకున్నారు ఫ్యాన్స్. అభిమానులు పవన్ కళ్యాణ్ సినిమాని ఇంతలా సెలబ్రేట్ చేసుకోవడం గతం లో గబ్బర్ సింగ్ చిత్రానికి మాత్రమే జరిగింది. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి 316 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టడమే కాకుండా, 50 రోజులు, వంద రోజులు కూడా థియేటర్స్ లో ప్రదర్శితమవ్వడం గమనించాల్సిన విషయం. దాదాపుగా 20 కేంద్రాల్లో 50 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం, రెండు కేంద్రాల్లో 100 రోజులను పూర్తి చేసుకుంది.
కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నియోజగవర్గం లో, కోడూరు అనే ప్రాంతం లో ఉన్నటువంటి శ్రీ లక్ష్మి అనే థియేటర్ లో గ్యాప్ లేకుండా ప్రతీ రోజు నాలుగు ఆటలతో ఈ చిత్రం 100 రోజుల వైపు దూసుకెళ్తోంది. మరో పది రోజుల్లో సత్తా దినోత్సవం జరుపుకోబోతున్న సందర్భంగా భారీ లెవెల్ లో శ్రీ లక్ష్మి థియేటర్ లో సంబరాలు చేయడానికి అభిమానులు సిద్ధం అవుతున్నారు. ఓటీటీ కాలం లో ఒక సినిమా రెండు మూడు వారాలు థియేటర్స్ లో ఆడడమే ఎక్కువ అనుకుంటున్న ఈ రోజుల్లో, వంద రోజులు ప్రదర్శితమవ్వడం నిజంగా అరుదైన సందర్భమే. మరోపక్క ఈ చిత్రం వంద రోజులు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున కొన్ని సెలెక్టెడ్ మెయిన్ థియేటర్స్ లో ఓజీ చిత్రం స్పెషల్ షోస్ ని ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి మరి. ఈ ఏడాది చివర్లో, అనగా డిసెంబర్ 31 న ‘జల్సా’ చిత్రాన్ని గ్రాండ్ గా రీ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఆ సినిమాని థియేటర్స్ లో ఎంజాయ్ చేసిన కొద్దిరోజులకే ఓజీ 100 రోజుల స్పెషల్ షోస్ ని అభిమానులు విజయవంతం చేస్తారా లేదా అనేది చూడాలి.