https://oktelugu.com/

Prabhas : అధికారికంగా వాయిదాపడ్డ ప్రభాస్ ‘రాజా సాబ్’ చిత్రం..కొత్త విడుదల తేదీ ఎప్పుడంటే!

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాలలో ముందుగా విడుదల అవ్వడానికి సిద్ధంగా ఉన్న చిత్రం 'రాజాసాబ్'.

Written By:
  • Vicky
  • , Updated On : December 18, 2024 / 01:57 PM IST

    Raja Saab

    Follow us on

    Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాలలో ముందుగా విడుదల అవ్వడానికి సిద్ధంగా ఉన్న చిత్రం ‘రాజాసాబ్’. మారుతి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ హారర్ కామెడీ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో ప్రభాస్ రెండు విభిన్నమైన గెటప్స్ లో కనిపిస్తున్నాడు. ఒక గెటప్ లో ఆల్ట్రా స్టైలిష్ గా కనిపించగా, మరో గెటప్ లో ముసలి రాజు లాగా కనిపించి అందరినీ ఆశ్చర్యపోయేలా చేసాడు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా హారర్ జానర్ చిత్రాల ట్రెండ్ నడుస్తుండగా, ఈ సినిమా క్లిక్ అయితే కచ్చితంగా బాలీవుడ్ లో కూడా ప్రభంజనం సృష్టిస్తుందని అభిమానులు బలమైన నమ్మకంతో ఉన్నారు. కల్కి చిత్రం థియేటర్స్ లో విజయవంతంగా నడుస్తున్న సమయంలోనే ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ వీడియో విడుదల చేసారు. ఈ వీడియోలో సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఏప్రిల్ 10 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నామంటూ చెప్పుకొచ్చారు.

    అందుకు తగ్గట్టుగానే హైదరాబాద్ రామోజీ ఫిలిం స్టూడియోస్ లో భారీ సెట్స్ ని ఏర్పాటు చేసి షూటింగ్ ని శరవేగంగా పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేశారు. కానీ అనూహ్యంగా ప్రభాస్ కాళ్లకు గాయాలు అవ్వడంతో, డాక్టర్ల సూచన మేరకు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. అంతే కాకుండా ఈ సినిమాకి సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ బోలెడంత మిగిలి ఉండడంతో మేకర్స్ ప్రస్తుతానికి ఈ చిత్రం విడుదల తేదీన వాయిదా వేయడమే మంచిది అని నిర్ణయించుకున్నారు. దీంతో ఏప్రిల్ 10 న విడుదల అవ్వాల్సిన ఈ సినిమా ఆగస్టు 15 , లేదా సెప్టెంబర్ 25 వ తేదీలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన క్రిస్మస్ లోపు రానుంది. మరోపక్క ప్రభాస్ అభిమానులు ఈ సినిమా వాయిదా పట్ల తీవ్రమైన అసహనం ని వ్యక్తం చేస్తున్నారు.

    ఈ చిత్రంలో హీరోయిన్స్ లో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ నటిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నాడు. ప్రభాస్ పుట్టినరోజు విడుదల చేసిన సరికొత్త మోషన్ టీజర్ కి అభిమానులు, ప్రేక్షకుల నుండి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. హారర్ జానర్ లో ఒక సూపర్ స్టార్ సినిమా చూసి చాలా రోజులైంది. అప్పుడెప్పుడో చంద్రముఖి చిత్రం ఒక్కటే వచ్చింది. ఆ తర్వాత స్టార్ హీరోలు ఈ జానర్ లో సినిమాలు చేయడం బాగా తగ్గించేశారు. మళ్ళీ ఇన్నాళ్లకు పాన్ ఇండియన్ సూపర్ స్టార్ స్టేటస్ లో ఉన్న ప్రభాస్ ఈ జానర్ లో నటిస్తున్నాడు. మరి ఈ చిత్రాన్ని ఆడియన్స్ ఎలా తీసుకుంటారో చూడాలి. ఈ చిత్రం తో పాటు ప్రభాస్ ‘సలార్ 2’ మూవీ షూటింగ్ ని కూడా సమాంతరంగా చేస్తున్నాడు. ఈ రెండు షూటింగ్స్ లో బిజీ గా ఉన్నప్పుడే యాక్షన్ షాట్ తీస్తున్నప్పుడు ప్రభాస్ కాళ్లకు గాయమైంది.