CGS Scheme: రైతే రాజు.. తమది రైతు ప్రభుత్వం.. రైతుల సంక్షేమానికి అది చేస్తున్నాం.. ఇది చేస్తున్నాం అంటూ పాలకులు చెబుతుంటారు. అనేక సంక్షేమ పథకాలు కూడా ప్రవేశపెడతాయి. రుణమాఫీలు, ఎరువులపై రాయితీ, ఉచిత విద్యుత్ వంటి అనేక పథకాలు రైతులకు అందుతున్నాయి. అయినా మద్దతు ధర విషయంలో రైతులు వివక్షకు గురవుతున్నారు. ఇప్పటికీ ధర కోసం రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి. ఇదిలా ఉంటే. రైతులకు పంటల పెట్టుబడి కోసం ప్రభుత్వాలు బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తున్నాయి. అయితే కేంద్రం తాజాగా పంట కోసిన తర్వాత కూడా రుణాలు ఇచ్చేలా కొత్త పథకం ప్రారంభించింది. రూ.1000 కోట్లతో ఈ పథకం ప్రారంభించింది. ఈ క్రెడిట్ గ్యారెంటీ స్కీం కింద పంట కోసిన తర్వాత కూడా రుణాలు ఇస్తారు. గిడ్డంగుల్లో రైతుల పంటలు దాచుకుని, వాటికి సంబంధించిన పత్రాలు అందించి రుణాలు పొందాల్సి ఉంటుంది.
రైతుల ఆదాయం పెంపే లక్ష్యంగా..
దేశంలో రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా కేంద్రం ఈ కొత్త పథకం తీసుకువచ్చింది. రైతులకు సులువుగా రుణాలు ఇచ్చేందుకు ఈ పథకం ప్రవేశపెట్టింది. క్రెడిట్ గ్యారెంటీ పథకం కింద రూ.1000 కోట్లు కేటాయించింది. వేర్ హౌసింగ్ డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ – డబ్ల్యూడీఆర్‌ఏ రిజిస్టర్డ్ రిపోజిటరీలు జారీ చేసిన ఎలక్ట్రానిక్ నెగోషియబుల్ వేర్‌హౌస్ రశీదులు ఈ ఎన్‌డబ్ల్యూఆర్‌లు బ్యాంకులు రైతులకు రుణాలు అందించడమే ఈ క్రెyì ట్ గ్యారెంటీ పథకం లక్ష్యం.
ఇలా తీసుకోవాలి..
రైతులు పంట కోసిన తర్వాత తమ ఉత్పత్తులను ఉంచిన వేర్‌హౌసింగ్ డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ(డబ్ల్యూడీఆర్‌ఏ)రిసిస్టర్డ్ రిపోజిటరీలు ఇచ్చే ఎలక్ట్రానిక్ నెగోషియబుల్ వేర్‌హౌస్ రిసిప్ట్‌లను బ్యాంకులకు అందించి లోను పొందవచ్చు. ఈఎన్‌డబ్ల్యూఆర్‌లను తీసుకుని రునం ఇవ్వకపోవడం అనేది ఉండకుండా ఈ పథకం లక్ష్యం. బ్యాంకులు ఉదార విధానాలతో రైతులకు రుణాలు ఇచ్చి ప్రోత్సహించాలని కేంద్రం ఆదేశించింది. దేశంలో పంట రుణాలు ఏటా రూ.21 లక్షల కోట్లు చెల్లిస్తున్నారు. ఇక పంట కోసిన తర్వాత తీసుకునే రుణాలు మాత్రం కేవలం రూ.40 కోట్లే. రానున్న పదేళ్లలో పంట అనంతర రుణాలు రూ.5.5 లక్షల కోట్లకు పెరిగేలా ఈ పథకం రూపొందించింది.