Project K – Kamal Haasan : దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కే చిత్రాన్ని పాన్ వరల్డ్ మూవీ అన్నారు. ఆయన ప్రకటనకు తగ్గట్లే ఈ చిత్ర అప్డేట్స్, మేకింగ్ ఉంది. దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఇండియాలోనే టాప్ హీరోయిన్ గా ఉన్న దీపికా పదుకొనె నటిస్తుంది. అలాగే అమితాబ్ బచ్చన్ వంటి లెజెండ్ కీలక రోల్ చేస్తున్నారు. హాట్ బాంబ్ దిశా పటాని మరొక హీరోయిన్. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే బడ్జెట్ రూ. 500 కోట్లకు పై మాటే.
ఫిల్మ్ మేకింగ్ లో స్క్రాచ్ అనే సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నారు. సినిమాలో ఉపయోగించే ప్రతి వస్తువు,వాహనం ఈ స్క్రాచ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో రూపొందిస్తున్నారు. దాదాపు రెండేళ్లుగా షూటింగ్ జరుపుకుంటుంది. 2024 సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉంటే నేడు చిత్ర యూనిట్ చేసిన ప్రకటన అందరి మైండ్స్ బ్లాక్ చేసింది. లోకనాయకుడు కమల్ హాసన్ ప్రాజెక్ట్ కే లో నటిస్తున్నట్లు యూనిట్ వెల్లడించారు.
ప్రాజెక్ట్ కే మూవీలో కమల్ హాసన్ రోల్ ఏమై ఉంటుంది? చిత్రీకరణ చివరి దశకు చేరుకున్నాక కమల్ ఎంట్రీ ఏంటీ? అనే అనేక సందేహాలు తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలో ఆయనది జస్ట్ క్యామియో కావచ్చు. క్లైమాక్స్ లో తళుక్కున మెరిసే పాత్ర కూడా కావచ్చు. అలాగే నిడివి కలిగిన కీలక రోల్ కూడా వచ్చాడు. ఏది ఏమైనా ప్రాజెక్ట్ కే మూవీలో కమల్ హాసన్ అన్న ప్రకటన గూస్ బంప్స్ లేపుతుంది. చిత్రానికి ఎక్కడ లేని హైప్ తెస్తుంది.
ఇది మార్కెట్ పరంగా కూడా బాగా కలిసొచ్చే అంశం. ప్రభాస్ సినిమాలకు తెలుగు తర్వాత హిందీలో మాత్రమే మార్కెట్ ఏర్పడింది. బాహుబలి మినహాయిస్తే సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ చిత్రాలను తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పట్టించుకున్న నాథుడు లేడు. కాబట్టి కమల్ నటించడంలో సౌత్ లో ఆదరణ దక్కవచ్చు.
ప్రాజెక్ట్ కే సోషియో ఫాంటసీ చిత్రం. అలాగే భగవంతుడు, పురాణాల ప్రస్తావన కూడా ఉంటుందని సమాచారం. ప్రాజెక్ట్ కే అనేది వర్కింగ్ టైటిల్ గా ఉంది. కే అంటే లార్డ్ కృష్ణ అనే ఒక వాదన ఉంది. అనగా ప్రాజెక్ట్ కృష్ణ ఇది. మూవీలో శ్రీకృష్ణుడు ప్రస్తావన గట్టిగా ఉంటుందంటున్నారు. ఇవన్నీ ఊహాగానాలే కానీ అధికారిక సమాచారం లేదు. ప్రాజెక్ట్ కే చిత్రాన్ని అశ్వినీ దత్ నిర్మిస్తున్నారు.