https://oktelugu.com/

Gujarath : అమ్మాయిలను కెలికితే ఇట్టానే ఉంటది.. నడిరోడ్డుపై యువకుడ్ని ఏంచేశారంటే

నేటి యువతులతో పెట్టుకుంటే సినిమా అలానే  ఉంటుందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ కాలంలో ఆడపిల్లలు ఇలా ఉంటేనే బతకలగలరు.. లేకుంటే అలాంటి వెధవలు రాజ్యమేలుతారు.. వారికి ఇలానే బుద్ధి చెప్పాలంటూ ఎక్కువ మంది వ్యాఖ్యానించారు. ఆకతాయి యువకుడిపై దాడిచేసిన యువతులకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 

Written By:
  • Dharma
  • , Updated On : June 25, 2023 / 02:01 PM IST
    Follow us on

    Gujarath : ఆత్మాభిమానానికి ప్రతీకలు మహిళలు. వారి మౌనం కొంతవరకే. ఎదురుతిరిగారంటే అపర కాళికలే. ఇది చాలా సందర్భాల్లో నిరూపితమైంది. తాజాగా ఇటువంటి ఘటనకు సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ ఆకతాయి యువకుడి చేష్టలతో విసిగివేశారిపోయిన అక్కాచెల్లెళ్లు నడిరోడ్డుపైనే యువకుడికి నరకం చూపించారు. దేహశుద్ధి చేశారు. స్థానికులు వారికి సాయం చేయడంతో ఆ యువకుడికి దబిడదిబిడే అయ్యింది.

    గుజరాత్ లోని అహ్మదాబాద్ లో విజయ్ సర్కారే అనే యువకుడు అక్కాచెల్లెళ్లు అయిన ఇద్దరు యువతులను ఏడిపించేవాడు. రోజూ వెంటపడి వేధించేవాడు. శృతిమించి వ్యవహరించేవాడు. అయినా సరే మౌనంగా భరించారు. ఓ రోజు ఆ ఇద్దరిలో ఒకరికి ముద్దుపెట్టాడు. దీంతో కోపోద్రిక్తులైన ఆ ఇద్దరు యువతులు అపర కాళికలుగా మారారు. యువకుడ్ని రోడ్డుపై పడేసి ఇష్టారీతిలో కొట్టిపారేశారు. అందులో ఓ యువతి బెల్ట్ తో విచాక్షణారహితంగా కొట్టింది. ఆ యువకుడిపై ఉన్న ఆగ్రహాన్ని తన చేతల ద్వారా చూపించింది. అటువైపు గా వెళుతున్న వారు సైతం తలోచేయి వేయడంతో యువకుడి పలాయనం చిత్తగించాడు.

    అయితే ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లను ఆకర్షిస్తోంది. నేటి యువతులతో పెట్టుకుంటే సినిమా అలానే  ఉంటుందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ కాలంలో ఆడపిల్లలు ఇలా ఉంటేనే బతకలగలరు.. లేకుంటే అలాంటి వెధవలు రాజ్యమేలుతారు.. వారికి ఇలానే బుద్ధి చెప్పాలంటూ ఎక్కువ మంది వ్యాఖ్యానించారు. ఆకతాయి యువకుడిపై దాడిచేసిన యువతులకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.