Common Civil Code :  కామన్ సివిల్ కోడ్ అంటే ఏంటి? మోడీ తెస్తున్నా ఈ చట్టం వస్తే ఏం జరుగుతుంది?

కేంద్రం తెచ్చే కామన్‌ సివిల్‌ కోడ్‌తో భారతీయ మహిళలందరికీ ఒకే రకమైన న్యాయం అందుబాటులోకి వస్తుంది. విధాన పరంగా కూడా వ్యత్యాసాలు ఉండవు, ముస్లిం మహిళలకు కూడా సమ న్యాయం జరుగుతుంది.

Written By: Raj Shekar, Updated On : June 25, 2023 1:47 pm
Follow us on

Common Civil Code : కేంద్రం కామన్‌ సివిల్‌ కోడ్‌ బిల్లు తీసుకురావడానికి చర్యలు చేపట్టింది. వర్షాకల పార్లమెంట్‌ సమావేశాల్లో దీనిని ప్రవేశపెట్టేలా కేంద్రం కసరత్తు చేస్తోంది. అయితే దీనిని విపక్షాలు వ్యతిరేకించాలని భావిస్తున్నాయి. దీంతో అసలు కామన్‌ సివిల్‌ కోడ్‌ అంటే ఏమిటి.. అది వస్తే ఏమౌతుంది. విపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయన్న కన్ఫ్యూజన్‌ ప్రజల్లో నెలకొంది.
చట్టం ఒకటే.. విధానం వేరు..
భారత దేశంలో చట్టం. న్యాయం ఒకేలా ఉన్నాయి. కానీ విధానపరమైన తేడాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. సంప్రదాయాలు, ఆచార వ్యవహారాల ఆధారంగా విధానపరమైన తేడాలు ఉన్నాయి. పెళ్లి విషయానికి వస్తే హిందువుల్లోనే భిన్నమైన రీతిలో పెళ్లి జరగుతుంది. ఒకరు రెండు బిల్లలు ఉన్న తాళి కడితే, కొన్ని ఆచారాల్లో ఒకే తాళి బిల్ల ఉంటుంది. తమిళ సంప్రదాయంలో మూడు బిల్లలు ఉంటాయి. క్రిష్టియన్లకు తాళే ఉండదు. ఇలా వివాహ చట్టం ఒకే అయినా విధానపరంగ తేడాలు ఉన్నాయి.
విడాకుల విషయంలోనూ.. 
విడాకుల విషయంలో హిందులు, క్రిష్టియన్లకు ఒకే రకమైన చట్టం అమలవుతోంది. ముస్లింల విషయానికి వచ్చే సరికి మాత్రం తేడాలు ఉన్నాయి. సాధారణంగా విడాకులు ఇస్తే భార్యకు భర్త భరణం ఇవ్వాలి. పిల్లల పోషణ బాధ్యత కూడా తీసుకోవాలి. భార్య మరో పెళ్లి చేసుకుంటే భరణం ఇవ్వాల్సి అవసరం లేదు. కానీ ముస్లిం మతంలో ఇది పూర్తిగా భిన్నంగా ఉంది. భరణం ఇవ్వాల్సిన పనిలేదు. ఎన్ని పెళ్లిళ్లు అయినా చేసుకోవచ్చు. దీంతో ముస్లిం మహిళలు నష్టపోతున్నారు.
కామన్‌ సివిలో కోడ్‌తో సమ న్యాయం.. 
కేంద్రం తెచ్చే కామన్‌ సివిల్‌ కోడ్‌తో భారతీయ మహిళలందరికీ ఒకే రకమైన న్యాయం అందుబాటులోకి వస్తుంది. విధాన పరంగా కూడా వ్యత్యాసాలు ఉండవు, ముస్లిం మహిళలకు కూడా సమ న్యాయం జరుగుతుంది. అయితే విపక్షాలు కొన్ని వర్గాల ఓట్ల కోసం ఈ విల్లును వ్యతిరేకిస్తున్నాయి. ముస్లింలలో వ్యతిరేక భావాన్ని తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాయి.