Odela 2 Movie : ఈమధ్య కాలం లో నిర్మాతలకు థియేట్రికల్ కలెక్షన్స్, బిజినెస్ తో సంబంధం లేకుండా ఓటీటీ మరియు ఇతర నాన్ థియేట్రికల్ రైట్స్ తోనే భారీగా టేబుల్ ప్రాఫిట్స్ వస్తున్నాయి. పెద్ద హీరోల సినిమాలకు అయితే వంద కోట్ల రూపాయలకు ఓటీటీ రైట్స్ అమ్ముడుపోతున్నాయి. మీడియం రేంజ్ హీరోల సినిమాలకు కూడా ఓటీటీ రైట్స్ కారణంగా భారీగా నిర్మాతలకు లాభాలు వస్తున్నాయి. నిన్న విడుదలైన ‘ఓదెల 2′(Odela 2 Movie) చిత్రానికి విడుదలకు ముందే డిజిటల్ రైట్స్, సాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్ హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోయాయి. ఈ చిత్రానికి పెట్టిన బడ్జెట్ మొత్తం నాన్ థియేట్రికల్ రైట్స్ తోనే వచేశాయని నిర్మాతలు ఎంతో మురిసిపోయారు. కానీ నిన్న థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రానికి మొదటి ఆట నుండే ఫ్లాప్ టాక్ వచ్చింది. థియేటర్స్ లో వచ్చే వసూళ్లతో పని లేకుండా నిర్మాత ప్రస్తుతం సేఫ్ జోన్ లో ఉన్నాడు.
Also Read : ఓదెల 2′ మొదటిరోజు వరల్డ్ వైడ్ వసూళ్లు..కనీసం ప్రొమోషన్స్ ఖర్చులు కూడా రాలేదు!
ఇకపోతే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్(Amazon Prime Video) సంస్థ దాదాపుగా 18 కోట్ల రూపాయలకు అన్ని భాషలకు కలిపి కొనుగోలు చేసింది. అమెజాన్ ప్రైమ్ లో హిందీ డబ్బింగ్ వెర్షన్ కి భారీగా రెస్పాన్స్ వస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇలాంటి సినిమాలను అక్కడి ఆడియన్స్ ఎగబడి మరీ చూస్తుంటారు. కాబట్టి ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యాక కచ్చితంగా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుంది అని విశ్లేషకుల అభిప్రాయం. అయితే ముందుగా కుదిరించుకున్న ఒప్పందం ప్రకారం ఈ సినిమాని ఆరు వారాల తర్వాతనే ఓటీటీ లో విడుదల చేయాలి. కానీ థియేటర్స్ లో ఈ చిత్రం వసూళ్లు చాలా పూర్ గా వస్తుండడంతో నాలుగు వారాలకే అమెజాన్ ప్రైమ్ లో అప్లోడ్ చేసే అవకాశం ఉంది. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రానుంది.
ఇకపోతే ఓదెల 2 కి మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా కేవలం కోటి రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయట. ఈ చిత్రాన్ని 11 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిన బయ్యర్స్ కి ఇది చాలా పెద్ద షాక్ అనే చెప్పొచ్చు. గతంలో సంపత్ నంది హెబ్బా పటేల్ ని ప్రధాన పాత్రలో పెట్టి ‘ఓదెల రైల్వే స్టేషన్’ అనే చిత్రం తీసాడు. ఈ సినిమా లాక్ డౌన్ సమయంలో ఆహా మీడియా యాప్ లో విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఆ సినిమా ఎక్కడైతే ముగుస్తుందో, ఓదెల 2 అక్కడి నుండి మొదలు అవుతుంది. మొదటి భాగం లో చనిపోయే విలన్, రెండవ భాగంలో ప్రేతాత్మగా మారి ఊర్లోని జనాలను పట్టి పీడిస్తూ ఉంటాడు. అతన్ని లేడీ అఘోరి తమన్నా ఎలా అడ్డుకొని ఊరి జనాలను కాపాడింది అనేదే ఓదెల 2 స్టోరీ.
Also Read : కల్కి 2 మీద అంచనాలను పెంచుతున్న నాగ్ అశ్విన్…