Arjun of Vyjayanthi : నందమూరి కళ్యాణ్ రామ్(Nandamuri Kalyan Ram) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి'(Arjun S/O Vyjayanthi) చిత్రం నేడు గ్రాండ్ గా విడుదలై మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. సినిమా రొటీన్ గా, పాత సినిమాల స్టైల్ లోనే ఉంది కానీ, యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ సన్నివేశాలు బాగా వర్కౌట్ అవ్వడంతో ఫ్యామిలీ ఆడియన్స్ లో ఈ చిత్రానికి మంచి ఆదరణ దక్కే అవకాశం ఉందని సినిమాని చూసిన ప్రేక్షకుల సోషల్ మీడియా లో చెప్తున్నారు. ముఖ్యంగా సీనియర్ హీరోయిన్ విజయశాంతి(Vijayashanti), కళ్యాణ్ రామ్ మధ్య వచ్చే ప్రతీ సన్నివేశానికి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారట. పబ్లిక్ టాక్ మంచి పాజిటివ్ గా ఉండడంతో ఓపెనింగ్స్ కూడా చాలా సాలిడ్ గా వచ్చేలా ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి గంటకు నాలుగు వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి.
Also Read : ‘అర్జున్ S/O వైజయంతి’ ట్విట్టర్ రివ్యూస్ వచ్చేసింది..ఈ రేంజ్ లో చెప్తున్నారేంటి!
కళ్యాణ్ రామ్ రేంజ్ కి ఇది ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఈ ట్రెండ్ ని బట్టి చూస్తుంటే ఈ చిత్రానికి మొదటి రోజు తెలుగు రాష్ట్రాల నుండి రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, వరల్డ్ వైడ్ గా మూడు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, ఆరు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు. కళ్యాణ్ రామ్ కమర్షియల్ సినిమాలు చేసినప్పుడల్లా దాదాపుగా సూపర్ హిట్స్ ని అందుకున్నాడు. కొత్త దర్శకులను ఇండస్ట్రీ కి పరిచయం చేసి వాళ్ళని పెద్ద రేంజ్ కి తీసుకొని వెళ్లడం కళ్యాణ్ రామ్ కి వెన్నతో పెట్టిన విద్య. ఇప్పటి వరకు సురేందర్ రెడ్డి, అనిల్ రావిపూడి, వశిష్ఠ వంటి టాలెంటెడ్ డైరెక్టర్స్ ని ఇండస్ట్రీ కి అందించిన కళ్యాణ్ రామ్, ఈ సినిమాతో ప్రదీప్ చిలుకూరి ని ఇండస్ట్రీ కి అందించాడు.
ఈ చిత్రాన్ని ఎక్కడా కూడా బోర్ అనిపించకుండా చాలా చక్కగా తీసాడు ప్రదీప్. ఫస్ట్ హాఫ్ కాస్త స్లో గా ఉందని కొంతమంది అంటున్నారు కానీ, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమా కావడంతో అత్యధిక శాతం మంది ఆడియన్స్ కి అలా అనిపించకపోయి ఉండొచ్చు. అయితే ఈ సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ 23 కోట్ల రూపాయలకు పైగా జరిగింది. మొదటి రోజు మూడు కోట్లు వచ్చింది, పర్లేదు అనుకోవచ్చు. కానీ రేపు ఎల్లుండి మాత్రం కచ్చితంగా ఈ సినిమా భారీ జంప్స్ ని నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే టాక్ వచ్చినప్పటికీ కమర్షియల్ గా పెద్ద ఫెయిల్యూర్ అని అనిపించుకోక తప్పదు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తుంటే ఈ వీకెండ్ ఈ చిత్రానికి కేవలం 12 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చే అవకాశం ఉంది.
Also Read : హీరోతో సమానంగా విజయశాంతి ఫైట్స్..’అర్జున్ S/O వైజయంతీ’ టీజర్ అదుర్స్!