SRH vs MI : ఇటీవల ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో ముంబై జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. అంతే కాదు.. చివరి వరకు పోరాడి ఆ లక్ష్యాన్ని కాపాడుకుంది. ఐతే సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మైదానంలో భారీ స్కోరు నమోదవుతుందని అంచనాలు ఉన్నాయి. అయితే క్రికెట్లో “బాబా వంగా” గా పేరుపొందిన దక్షిణాఫ్రికా ఒకప్పటి స్పీడ్ బౌలర్ డేల్ స్టెయిన్ ముంబై ఇండియన్స్ తో జరిగే మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 300 పరుగుల స్కోర్ చేస్తుందని జోస్యం చెప్పాడు. ” ఇది సాధారణమైన అంచనా మాత్రమే. హైదరాబాద్ విశ్వరూపం చూపిస్తుంది. ముంబై పై 300 స్కోర్ మార్కు అందుకుంటుంది. అయితే ఈ అద్భుతాన్ని చూసేందుకు నేను అక్కడే ఉంటాను” స్టెయిన్ పేర్కొన్నాడు.
Also Read : రాజస్థాన్ పై ఢిల్లీ “సూపర్” విక్టరీ.. ట్రెండింగ్ లో బుమ్రా
సాధ్యమవుతుందా?
బలమైన ముంబై జట్టుపై హైదరాబాద్ 300 పరుగులు చేస్తుందా? ఈ ప్రశ్నకు దాదాపు అవును అనే సమాధానమే వస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ జట్టు గత సీజన్లో సాధించిన అత్యుత్తమ పరుగులలో ఒక ఇన్నింగ్స్ ను ముంబై జట్టుపై ఆడింది. హైదరాబాద్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్లో సన్ రైజర్స్ మూడు వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. గత సీజన్లో మార్చి 27న ఈ మ్యాచ్ జరిగింది. ఉప్పల్ మైదానం మాదిరిగానే వాంఖడే కూడా చిన్నది. ఐతే ఈ సీజన్లో హైదరాబాద్ జట్టు ఆటగాళ్లలో అభిషేక్ శర్మ పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో టచ్ లోకి వచ్చాడు. హెడ్ భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. ఇషాన్ కిషన్ తొలి మ్యాచ్లో సెంచరీ చేశాడు. ఆ తర్వాత ఆ స్థాయి ఇన్నింగ్స్ ఆడలేదు.. ఇక ముంబైలో బుమ్రా, బౌల్ట్ వంటి సీనియర్ బౌలర్లు ఉన్నారు. అదరగొట్టేందుకు హార్థిక్ పాండ్యా కూడా రెడీగా ఉన్నాడు. ఈ లెక్కన హైదరాబాద్ జట్టుకు 300 స్కోర్ చేయడం కష్టమే. కాకపోతే అసాధ్యం కాదు.
గత రికార్డులు ఎలా ఉన్నాయంటే?
ఇంకా ఐపీఎల్ చరిత్రలో గత సీజన్లో బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ మూడు వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. ఇది హైదరాబాద్ జట్టుకే కాదు.. ఐపీఎల్ చరిత్రలో ఏ జట్టుకైనా ఇది హైయెస్ట్ స్కోర్. ఇక ఇదే సీజన్లో రాజస్థాన్ రాయల్స్ పై హైదరాబాద్ 6 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. గత సీజన్లో ముంబై జట్టుపై హైదరాబాద్ మూడు వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. గత సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై కోల్ కతా నైట్ రైడర్స్ 7 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. గత సీజన్లో హైదరాబాద్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ పై 7 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది. అయితే పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో విజయం సాధించిన తర్వాత.. హైదరాబాద్ ప్లేయర్లు దూకుడు మీద ఉన్నారు. వారిని నిలువరించకపోతే 300 పరుగులు ఈజీగా చేస్తారు. ప్రస్తుతం ఉన్న హైదరాబాదులో ఇషాన్ కిషన్ ఒకప్పుడు ముంబై జట్టులో సభ్యుడు. ఇక కోల్ కతా జట్టుకు ఆడినప్పుడు కమిన్స్ కేవలం 14 బంతుల్లోనే ముంబై జట్టుపై ఆప్షన్ చేశాడు..హెడ్ కు ముంబై జట్టు జెర్సీ అంటే చాలా ఇష్టం. మొత్తంగా చూస్తే హైదరాబాద్ జట్టులో భయంకరమైన ఆటగాళ్లు ఉన్నారు. ఇదే సమయంలో ముంబైలో ఎంతో ప్రతిభావంతమైన బౌలర్లు ఉన్నారు.