Tollywood: గతంలో చాలా సినిమాలు సముద్రం నేపథ్యంలో వచ్చేవి. కానీ కొన్ని సంవత్సరాల నుంచి అలాంటి సినిమాలు రాలేదు. అయితే మూడు సంవత్సరాల నుంచి మళ్లీ సముద్రం ట్రెండ్ నడుస్తోంది. సముద్రం నేపథ్యంలో వచ్చే సినిమాలు హిట్ లను కూడా కొడుతున్నాయి. అందుకే కావచ్చు టాలీవుడ్ కన్ను సముద్రం పై పడినట్టుంది. అయితే కొన్ని సముద్ర బ్యాక్ డ్రాప్ సినిమాల పోస్టర్లు, ట్రైలర్లు, గ్లింప్స్ అదిరిపోయాయి. అందుకే సముద్రం ఇండస్ట్రీకే సెంటిమెంట్ గా మారిందంటున్నారు. ప్రస్తుతం రాబోతున్న.. రీసెంట్ గా వచ్చిన సముద్ర నేపథ్యం సినిమాలో ఏంటో ఓ సారి చూసేద్దాం..
1..ఉప్పెన.. 2021లో రిలీజ్ అయిన ఉప్పెన సినిమా థియేటర్లలో ఉప్పెనను సృష్టించింది. సముద్ర నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి నటించి స్టార్లుగా ఎదిగారు.
2..వాల్తేరు వీరయ్య.. గత సంవత్సరం సంక్రాంతి కానుకగా వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా మంచి విజయం అందుకున్న విషయం తెలిసిందే. ఇందులో చిరంజీవి జాలరిగా నటించి బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇక బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రవితేజ కూడా కీలకపాత్రలో నటించారు.
3.. దేవర.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా దేవర. రీసెంట్ గా ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ అదిరిపోయాయి. అయితే ఈ సినిమా కూడా సముద్రం బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమా కోసం ఎదురుచూసే వారి సంఖ్యా కోకొల్లాలు. రిలీజ్ కంటే ముందే సినిమా పక్కా హిట్ అంటూ టాక్.
4.. తండేల్.. అక్కినేని నాగచైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ తండేల్ కూడా సముద్ర నేపథ్యంలో తెరకెక్కుతోంది. గుజరాత్ లో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. ఇందులో బోట్ డ్రైవర్ గా నటిస్తున్నారు చైతూ. చైతు సరసన సాయి పల్లవి నటిస్తోంది.
5.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుజీత్ కాంబోలో రాబోతున్న ఓటీ సినిమా ముంబై పోర్ట్, సముద్రం నేపథ్యంలోనే తిరుగుతుందట. దానికి సంబంధించిన సీన్స్ షూట్ ఇప్పటికే పూర్తి అయిందని టాక్.