https://oktelugu.com/

Sanjjanaa Galrani: హీరోయిన్ కి అసభ్యకర మెసేజ్​లు.. ప్రముఖ వ్యక్తి కుమారుడు అరెస్ట్​

Sanjjanaa Galrani: కన్నడ బ్యూటీ ‘సంజన గల్రాని’కి అసభ్యకర మెసేజ్​లు రావడం.. ఆమె పోలీస్ కేసు పెట్టడం.. ఆ మెసేజ్ లు చేసింది కొరియోగ్రాఫర్ కుమారుడు అని తెలియడం, అతన్ని అరెస్ట్​ చేయడం చాలా వేగంగా జరిగిపోయింది. అసలు ‘సంజన గల్రాని’ అంటేనే.. ముందుగా డ్రగ్స్ వార్తలు గుర్తుకువస్తాయి. అంతగా అమ్మడు డ్రగ్ దందాలో నలిగిపోయింది. ఏకంగా జైలుకి కూడా పోయి కొన్నాళ్ళ పాటు జైలు జీవితాన్ని కూడా అనుభవించింది. మొత్తానికి ఎలాగోలా బెయిల్ సంపాదించి ప్రస్తుతం […]

Written By:
  • Shiva
  • , Updated On : March 5, 2022 / 12:02 PM IST
    Follow us on

    Sanjjanaa Galrani: కన్నడ బ్యూటీ ‘సంజన గల్రాని’కి అసభ్యకర మెసేజ్​లు రావడం.. ఆమె పోలీస్ కేసు పెట్టడం.. ఆ మెసేజ్ లు చేసింది కొరియోగ్రాఫర్ కుమారుడు అని తెలియడం, అతన్ని అరెస్ట్​ చేయడం చాలా వేగంగా జరిగిపోయింది. అసలు ‘సంజన గల్రాని’ అంటేనే.. ముందుగా డ్రగ్స్ వార్తలు గుర్తుకువస్తాయి. అంతగా అమ్మడు డ్రగ్ దందాలో నలిగిపోయింది. ఏకంగా జైలుకి కూడా పోయి కొన్నాళ్ళ పాటు జైలు జీవితాన్ని కూడా అనుభవించింది.

    Sanjjanaa Galrani:

    మొత్తానికి ఎలాగోలా బెయిల్ సంపాదించి ప్రస్తుతం పెళ్లి చేసుకుని త్వరలో తల్లి కూడా కాబోతుంది. ఇలాంటి టైంలో ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రసాద్​ బిడప​ కుమారుడు ఆడమ్ బిడప నటి సంజన గల్రానికి అసభ్యకర మెసేజ్ లు పంపాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇందిరానగర్​ పోలీసులు అతడిని అరెస్ట్​ చేసి విచారిస్తున్నారు. ఆడమ్​ ఫిబ్రవరి 25 రాత్రి ఈ మెసేజ్ లు పంపినట్లు పోలీసులు తెలిపారు.

    తనపై వేధింపులకు సంబంధించిన చాట్​ వివరాలను సంజన పోలీసులకు అందించింది. నటి సంజన తెలుగులో ‘బుజ్జిగాడు’ సినిమాలో నటించింది. ఏది ఏమైనా డ్రగ్స్ కేసులో ఇరుక్కొని జైలుకి వెళ్లి వచ్చాక, ఆమె ఆలోచనలు కూడా పూర్తిగా మారిపోయాయట. గతంలో సాయంత్రం అయితే.. పార్టీ అంటూ పబ్ ల చుట్టూ తిరిగే సంజన.. ఈ మధ్య అసలు ఇంట్లో నుండి బయటకు రావడానికి కూడా ఇష్ట పడట్లేదట.

    Sanjjanaa Galrani:

    అలాగే పెళ్లి ఇక సినిమా రంగానికి కూడా పూర్తిగా దూరంగా ఉండాలని ఇప్పటికే ఫిక్స్ అయిందట. ఇక సంజన ఒకప్పుడు హైదరాబాద్, బెంగుళూర్, చెన్నై… ఇలా చక్కర్లు కొడుతూ.. సినిమాలతో పాటు ఇతర వ్యాపారాలు కూడా హ్యాపీగా చేసుకునేది. మరి అవ్వన్నీ మానేసి.. సంజన తన ఫ్యామిలీ లైఫ్ ను లీడ్ చేస్తోంది.

    Tags