Homeఎంటర్టైన్మెంట్ఓ పిట్ట కథ రివ్యూ: గూటికి చేరని పక్షి

ఓ పిట్ట కథ రివ్యూ: గూటికి చేరని పక్షి

విడుదల తేదీ: మార్చ్ 6, 2020
నటీనటులు: సంజయ్ రావ్, నిత్య శెట్టి, విశ్వంత్, బ్రహ్మాజీ తదితరులు
దర్శకత్వం: చందు ముద్దు
నిర్మాత: ఆనంద్ ప్రసాద్
సంగీతం: ప్రవీణ్ లక్కరాజు

భారీ బడ్జట్ సినిమాకైనా, చిన్న సినిమాకైనా స్క్రీన్ ప్లే చాలా చాలా ముఖ్యం. అది లోపిస్తే సినిమా విజయానికి ఆమడ దూరం లోనే ఆగిపోతుంది. యెంత మంచి కథ ఉన్నాగాని ఆ సినిమాన్ని కాపాడలేదు. ఓ పిట్టకథ సినిమా విషయంలోనూ అదే జరిగింది. బలహీనమైన స్క్రీన్ ప్లే చిత్ర విజయానికి అడ్డుగోడలా నిలబడింది.విడుదలకు ముందు మంచి హైప్ తెచ్చుకొన్న ఓ పిట్ట కథ సినిమా థియేటర్ల వద్దకు రాగానే చతికిల బడింది.

కథ:

ఒక అందమైన వెంకట లక్ష్మి అలియాస్ వెంకీ, తండ్రి పెంపకంలో గారాబంగా పెరుగుతుంది. తన తండ్రి ఫ్రెండ్ కొడుకు అయిన ప్రభు ని గాఢంగా ప్రేమిస్తుంది. ప్రభు, వెంకీ తండ్రి నడిపే సినిమా థియేటర్ లోనే మేనేజర్ గా పని చేస్తూ ఉండటంతో తరచూ వెంకీని కలుస్తుంటాడు. ఈ క్రమంలో వాళ్ళ ప్రేమ, పెళ్లి దగ్గరకి చెరబోతున్న సమయంలో మేనత్త కొడుకు నంటూ క్రిష్, వెంకీ వాళ్ళ ఇంటికి వస్తాడు. వెంకీ తండ్రి వీర్రాజు అతన్ని నమ్మి తన కూతురితో పెళ్లి జరపాలని ఫిక్స్ అవుతాడు. సరిగ్గా అదే సమయంలో వెంకీ అరకు వ్యాలీ కి వెళ్లి తిరిగిరాదు. వీర్రాజు పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీస్ ఎంక్వయిరీ లో వెంకీ అరకులో జరిగిన ఆక్సిడెంట్ లో మరణించి నట్టు తెలుస్తోంది. దానికి తోడు క్రిష్ ఆమె మరణానికి కారణం ప్రభుయే అని పోలీస్ లను నమ్మిస్తాడు. కానీ పోలీస్ విచారణలో ప్రభు నిర్దోషి అని తేలుతుంది. దాంతో వెంకట లక్ష్మి ని ఎవరు మాయం చేశారు అన్న అంశం చుట్టూ సినిమా నడుస్తుంది.

దర్శకత్వం :

నూతన దర్శకుడు చెందు ముద్దు రాసుకున్న కథ బాగానే ఉంది. కానీ దానికి తగ్గ పకడ్బందీ అయిన స్క్రీన్ ప్లే తయారు చేసుకోక పోవడం వలన సినిమా సక్సెస్ తీరం చేర లేదు. జస్ట్ యావరేజ్ గా మిగిలిపోయింది. ఇక దర్శకుడు రాసుకున్న కథ కి మంచి డైలాగ్లు అమర లేదు. సరైన స్క్రీన్ ప్లే లేక పోవడం తో చిత్రం ఆసాంతం టీవీ సీరియల్ లా సాగి ఒకింత విసుగు పుట్టించింది.

నటీనటులు :

తెలుగు చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొన్న బ్రహ్మాజీ ఈ చిత్రం ద్వారా తన కొడుకు సంజయ్ రావు ని తెలుగు తెరకు హీరోగా పరిచయం చేయడం జరిగింది. ఇక నటుడిగా సంజయ్ తగినంతలో బానే నటించాడు. కానీ నటనని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోక తప్పదు. ఇక సినిమాలో రెండో హీరోగా నటించిన విశ్వాంత్ తన కున్న సినీ అనుభవం తో తన పాత్రకు న్యాయం చేసాడు. ఇక ఈ సినిమాకి హైలెట్ గా హీరోయిన్ నిత్యా శెట్టి నిలిచింది అనడంలో ఎటువంటి సందేహం అక్కరలేదు. ప్రముఖ టీవీ నటుడు, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ అయిన భోగిరెడ్డి శ్రీనివాస్ ఈ సినిమా లో హీరోయిన్ తండ్రి వీర్రాజు గా తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొన్నాడు. బ్రహ్మాజీ సహా ఇతర నటులు తమ తమ పాత్రలకు తగురీతిలో న్యాయం చేశారు.

సాంకేతిక నిపుణులు :

కథ, మాటలు, స్క్రీన్ ప్లే , దర్శకత్వం శాఖల్ని నిర్వహించిన చెందు ముద్దు కథకుడిగా, దర్శకుడిగా మాత్రం సక్సెస్ అయ్యాడు. మాటలు, స్క్రీన్ ప్లే విషయం లో మాత్రం ఫెయిల్ అయ్యాడు. తన తదుపరి చిత్రంలో అయినా వాటిని సరిదిద్దుకొంటే మంచి దర్శకుడిగా మిగులుతాడు. ఇక ప్రవీణ్ లక్కరాజు సంగీతం ఏమంత ఆకట్టు కోలేదు. అనుభవ రాహిత్యం కొట్టొచ్చినట్టు కనపడింది.చివరగా సునీల్ కుమార్ కెమెరా పనితనం మాత్రం సినిమాని ఆసక్తిగా నడిపించింది.

విశ్లేషణ :

ఎటువంటి సినిమా అయినా స్క్రీన్ ప్లే మీద ఆధారపడి సక్సెస్ సాధిస్తుంది. అందుకే హాలీవుడ్ లో స్క్రీన్ ప్లే రచయితలకు అగ్ర తాంబూలం ఇస్తారు. అక్కడే కాదు ఏ దేశమైనా, ఏ భాష అయినా స్క్రీన్ ప్లే నే సినిమాకి మూలాధారం అది ఓ పిట్టా కదా సినిమాలో బాగా లోపించింది. మంచి కాదని అనవసర సాగతీత దృశ్యాలతో విజయానికి దూరం చేసుకొన్నారు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version