https://oktelugu.com/

కరోనా దెబ్బకి భయపడ్డ రజినీకాంత్

రజినీకాంత్ ‘అణ్ణాత్త‌’ సినిమా ఇప్ప‌టి వ‌ర‌కు రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది. మిగ‌తా షెడ్యూల్స్‌ని కోల్‌క‌త్తా, పూణేలో ప్లాన్ చేశారు. అయితే కరోనా వైరస్ దెబ్బతో ఈ సినిమా తాత్కాలికంగా వాయిదా పడింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లమందిని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రస్తుతం భారత్ ప్రజలను కూడా భయపెడుతున్న విషయం తెలిసిందే.. అయితే కొంత కాలం జనసందోహం ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్లడం మానుకుంటే మంచిదనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది. ఈ కారణంగానే సినిమాకి సంబంధించిన […]

Written By:
  • Neelambaram
  • , Updated On : March 7, 2020 / 11:01 AM IST
    Follow us on


    రజినీకాంత్ ‘అణ్ణాత్త‌’ సినిమా ఇప్ప‌టి వ‌ర‌కు రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది. మిగ‌తా షెడ్యూల్స్‌ని కోల్‌క‌త్తా, పూణేలో ప్లాన్ చేశారు. అయితే కరోనా వైరస్ దెబ్బతో ఈ సినిమా తాత్కాలికంగా వాయిదా పడింది.

    ప్రపంచవ్యాప్తంగా కోట్లమందిని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రస్తుతం భారత్ ప్రజలను కూడా భయపెడుతున్న విషయం తెలిసిందే.. అయితే కొంత కాలం జనసందోహం ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్లడం మానుకుంటే మంచిదనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది. ఈ కారణంగానే సినిమాకి సంబంధించిన మిగిలిన షెడ్యూల్స్ ని కరోనా భయం తగ్గిన తర్వాత హైదరాబాద్ లోనే పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి.

    ఈ సినిమాలో న‌య‌న‌తార ప్ర‌ధాన పాత్ర‌ల‌లో నటించగా, విల‌న్‌గా గోపిచంద్ న‌టించ‌నున్న‌ట్టు స‌మాచారం. ఇమాన్ సంగీతం స‌మ‌కూర్చుతున్నారు.