
Heroine Anita : 2000 దశకంలో లవ్ చిత్రాలు బాగా ఆకట్టుకునేవి. ఈ కాలంలోని యూత్ కు అనుగుణంగా చాలా మంది డైరెక్టర్లు లవ్ తో కూడిన సినిమాలు తీసేవారు. కొత్త నటులను పరిచయం చేసినా లవ్ ఎమోషనల్ ఉంటే వారిని బాగా ఆదరించేవారు. ఈ సమయంలో వచ్చిన ప్రతీ ప్రేమ చిత్రం హిట్టు కొట్టింది. యాక్షన్ డైరెక్టర్లు సైతం యూత్ కు అనుగుణంగా లవ్ చిత్రాలు తీసేందుకు ప్రయత్నించేవారు. స్టార్ హీరోలతో ప్రేమ పాఠాలు చెబుతూ కుర్రాళ్లల్లో ఎమోషనల్ తెప్పించేవారు. వీరికి అనుగుణంగా పూర్తి లవ్ ఎమోషనల్ గా వచ్చిన చిత్రం ‘నువ్వు నేను’.
ఆ కాలంలో కొత్త వారితో సాహసం చేస్తూ డైరెక్టర్ తేజ సినిమాలు తీస్తుండేవారు. అలా ఉదయ్ కిరణ్, అనిత అనే ఇద్దరిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఉదయ్ కిరణ్ అంతకుముందే ‘చిత్రం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చినా ‘నువ్వు నేను’తోఫేమస్ అయ్యారు. అయితే నువ్వునేను బ్లాక్ బస్టర్ గా నిలవడంతో ఇందులో నటించిన హీరో, హీరోయిన్లు స్టార్లుగా మారిపోయారు. ముఖ్యంగా హీరోయిన్ గా నటించిన అనితకు ఈ సినిమాతో ఫ్యాన్స్ విపరీతంగా పెరిగారు.
ఈ సినిమాలో వసు పాత్రలో నటించిన అనితను నార్త్ నుంచి తీసుకున్నారు. ఈ సినిమాలో ఆమె నటించడానికి ఎంతో కష్డపడింది. ఒక దశలో ఆమెకు కన్నీళ్లు రాకపోవడంతో ఆమె చెంపపై డైరెక్టర్ తేజ చేయి వేసుకున్నట్లు వార్తలువచ్చాయి. అలా తేజ ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో ఈ సినిమా సక్సెస్ కావడంతో పాటు నంది అవార్డులను సొంతం చేసుకుంది. ఇందులో అందం, అభినయంతో ఆకట్టుకున్న అనిత ఆ తరువాత కొన్ని నిన్నె ఇష్టపడ్డాను, తొట్టి గ్యాంగ్, శ్రీరామ్, ఆడంతే అదో టైపు వంటి సినిమాల్లో కనిపించింది. ఈమె నటించిన సినిమాలు దాదాపు హిట్టు కొట్టినవే ఎక్కువగా ఉన్నాయి.
తెలుగులో అవకాశాలు రాకపోవడంతో హిందీ సీరియళ్లలో నటించడం ప్రారంభించింది. ఇదే సమయంలో గోవాకు చెందిన వ్యాపారవేత్త రోహిత్ రెడ్డిని పెళ్లి చేసుకుంది. వీరికి ఓ మగబిడ్డ జన్మించారు. అయితే అనిత సమయం దొరికినప్పుడల్లా హిందీ సీరియళ్లలో నటిస్తేనే ఉంది. కానీ ఇప్పటికీ ఆమె అప్పటి అందాన్నే కొనసాగిస్తోంది. ఆమెకు సంబంధించిన లేటేస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి.