https://oktelugu.com/

Heroine Anitha: నువ్వు నేను హీరోయిన్ ఎలా మారిపోయిందో చూశారా… హద్దులు దాటేసే గ్లామర్ షో!

నువ్వు నేను తర్వాత అనితకు ఆ రేంజ్ హిట్ పడలేదు. శ్రీరామ్ మూవీలో ఉదయ్ కిరణ్ తో మరోసారి జతకట్టింది. ఇక తొట్టిగ్యాంగ్ మూవీలో అల్లరి నరేష్ కి జంటగా నటించింది.

Written By: Shiva, Updated On : October 5, 2023 11:21 am
Follow us on

Heroine Anitha: 2001లో విడుదలైన నువ్వు నేను ఒక సెన్సేషన్. దర్శకుడు తేజ తెరకెక్కించిన ప్రేమకథా చిత్రాల్లో చాలా ప్రత్యేకమైంది. చిత్రం మూవీతో ఉదయ్ కిరణ్ ని హీరోగా పరిచయం చేసిన ఆయన తన రెండో చిత్రానికి కూడా ఉదయ్ కిరణ్ నే తీసుకున్నారు. నువ్వు నేను మూవీ గొప్పింటి అబ్బాయికి పేదింటి అమ్మాయికి మధ్య జరిగే ప్రేమకథ. రొటీన్ స్టోరీనే అయినా కామెడీ, ఎమోషనల్ అంశాలతో తేజా అద్భుతం చేశాడు. నువ్వు నేను బ్లాక్ బస్టర్ కావడంతో హీరోయిన్ గా నటించిన అనిత ఓవర్ నైట్ స్టార్ అయ్యింది.

నువ్వు నేను తర్వాత అనితకు ఆ రేంజ్ హిట్ పడలేదు. శ్రీరామ్ మూవీలో ఉదయ్ కిరణ్ తో మరోసారి జతకట్టింది. ఇక తొట్టిగ్యాంగ్ మూవీలో అల్లరి నరేష్ కి జంటగా నటించింది. ఈ రెండు చిత్రాలు ఓ మోస్తరు విజయాలు అందుకున్నాయి. టైర్ టూ హీరోలకు పరిమితమైన అనిత కెరీర్ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. 2012 తర్వాత టాలీవుడ్ కి దూరమైంది.

ఇక 2015లో వ్యాపారవేత్త రోహిత్ రెడ్డిని ప్రేమ వివాహం చేసుకుంది. గోవాలో ఘనంగా వీరి పెళ్లి జరిగింది. 2021లో అనిత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. వివాహమయ్యాక ఆమె వెండితెరకు దూరమైంది. అయితే 2022లో కమ్ బ్యాక్ ఇచ్చింది. హిందీ చిత్రం మారిచ్ లో నటించింది. సినిమాలు చేయకున్నా నటనకు దూరం కాలేదు. పలు హిందీ సీరియల్స్ లో నటించింది.

అటు ప్రొఫెషనల్ లైఫ్ అండ్ పర్సనల్ లైఫ్ బ్యాలన్స్ చేస్తూ ముందుకు వెళుతుంది. భర్త రోహిత్ ఆమెకు సపోర్ట్ ఇస్తున్నాడు. సోషల్ మీడియాలో అనిత చాలా యాక్టీవ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫ్యామిలీ విశేషాలు, ప్రాజెక్ట్స్ కి సంబంధించిన విషయాలు షేర్ చేస్తుంది. అలాగే హాట్ ఫోటో షూట్స్ తో రచ్చ చేస్తూ ఉంటుంది.

అనిత ప్రస్తుత వయసు 42 సంవత్సరాలు. నువ్వు నేను మూవీలో చూసిన అనితకు ఇప్పటి అనితకు చాలా తేడా వచ్చింది. ఆ సినిమాలో కాలేజ్ గర్ల్ లుక్ లో క్యూట్ గా ఉంది అనిత. పెళ్ళై పిల్లల్ని కన్నా కూడా ఆమె షేప్ అవుట్ కాలేదు. వయసు పెరగడంతో ఆ మార్పు కనిపిస్తుంది. ఫ్యాన్స్ అనితను ఇంస్టాగ్రామ్ లో ఫాలో అవుతూ ఉంటారు. అభిమానులకు ఆమె టచ్ లో ఉంటారు.