NTR: టెంపర్ తర్వాత ఎన్టీఆర్ కి ప్లాప్ లేదు. హిట్స్, సూపర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ నమోదు చేస్తున్నాడు. ఎన్టీఆర్ నటించిన గత రెండు చిత్రాలు ఆర్ ఆర్ ఆర్, దేవర పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటాయి. ఎన్టీఆర్ కి ఇండియా వైడ్ ఫేమ్ దక్కింది. దేవర వరల్డ్ వైడ్ రూ. 500 కోట్ల వసూళ్ల వరకు రాబట్టింది. ఈ చిత్రాన్ని జపాన్ లో విడుదల చేస్తున్నారు. అందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దేవర జపాన్ వెర్షన్ మార్చి 28న ఆ దేశంలో రిలీజ్ కానుంది. జపాన్ వెళ్లనున్న ఎన్టీఆర్… దేవర చిత్రాన్ని గట్టిగా ప్రమోట్ చేయాలని ఫిక్స్ అయ్యాడట.
Also Read: జైలర్ 2 అప్డేట్: రజినీ ఫ్యాన్స్ గెట్ రెడీ!
జపాన్ లో దేవర ఎలాంటి ఫలితం అందుకుంటుందో అనే ఆసక్తి నెలకొంది. మరో వైపు ఓ క్రేజ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఎన్టీఆర్ కొత్త మూవీ టైటిల్ రాక్ అట. దర్శకుడు ఎవరు అంటారా?.. జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్. సూపర్ స్టార్ రజినీకాంత్ కి నెల్సన్ జైలర్ మూవీతో భారీ కమ్ బ్యాక్ ఇచ్చాడు. జైలర్ వరల్డ్ వైడ్ రూ. 650 కోట్ల వరకు వసూలు చేసింది. నెల్సన్ కోలీవుడ్ టాప్ దర్శకుల్లో ఒకరిగా అవతరించాడు.
ఇక ఎన్టీఆర్ తో నెల్సన్ మూవీ చేయనున్నాడని కొంత కాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎట్టకేలకు వీరి ప్రాజెక్ట్ సాకారం అయ్యిందట. ఎన్టీఆర్-నెల్సన్ కాంబోలో ప్రాజెక్ట్ కన్ఫర్మ్ కాగా.. ‘రాక్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారట. ఈ భారీ ప్రాజెక్ట్ ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడట. టాలీవుడ్ విశ్వసనీయ వర్గాల నుండి ఈ మేరకు సమాచారం అందుతుంది. మరి ఇదే నిజమైతే ఎన్టీఆర్ లైనప్ మరింత స్ట్రాంగ్ కానుంది.
ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ లో పాల్గొంటున్నారు. హృతిక్ రోషన్ తో చేస్తున్న ఈ మల్టీస్టారర్ చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఆగస్టు లో విడుదల చేయాలి అనేది ప్లాన్. త్వరలో దర్శకుడు ప్రశాంత్ నీల్ మూవీ పట్టాలెక్కనుంది. డ్రగ్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. డ్రాగన్ టైటిల్ పరిశీలనలో ఉంది. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ ప్రాజెక్ట్ బడ్జెట్ రూ. 300 కోట్లకు పైమాటే అంటున్నారు.