https://oktelugu.com/

Jr NTR Cars: ఎన్టీఆర్ గ్యారేజ్ ఇంత ఖరీదైన కార్లు ఉన్నాయా..? వాటిని చూస్తే మతి పోతుంది…

బర్త్ డే ను పురస్కరించుకొని నిన్న దేవర సినిమా నుంచి రిలీజ్ ఒక సాంగ్ ను రిలీజ్ చేశారు. ఆ సాంగ్ కూడా ప్రేక్షకులకు, అభిమానులకు విపరీతంగా నచ్చడమే కాకుండా యూట్యూబ్ లో అత్యధికమైన వ్యూయర్ షిప్ ను సంపాదించుకొని ట్రెండింగ్ వన్ లో ఉందనే చెప్పాలి.

Written By:
  • Gopi
  • , Updated On : May 20, 2024 / 04:03 PM IST

    NTR New Luxury Cars

    Follow us on

    Jr NTR Cars: తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి నందమూరి నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన నటుడు జూనియర్ ఎన్టీయార్..ఈయన చేసిన సినిమాలు మంచి విజయాలను దక్కించుకున్నాయి. ప్రతి సినిమాలో ఈయన చేసిన క్యారెక్టర్ లో కూడా ఏదో ఒక వైవిధ్యమైన ఎలిమెంట్ అయితే ఉంటాయి. ఇక సింగిల్ టేక్ లో డైలాగులు చెప్పాలన్న, ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించాలన్న అది జూనియర్ ఎన్టీఆర్ కి మాత్రమే సాధ్యమవుతుంది. ఇక మొత్తానికైతే ఆయన ఈరోజు బర్త్ డే జరుపుకుంటున్న విషయం మనకు తెలిసిందే..

    ఆ బర్త్ డే ను పురస్కరించుకొని నిన్న దేవర సినిమా నుంచి రిలీజ్ ఒక సాంగ్ ను రిలీజ్ చేశారు. ఆ సాంగ్ కూడా ప్రేక్షకులకు, అభిమానులకు విపరీతంగా నచ్చడమే కాకుండా యూట్యూబ్ లో అత్యధికమైన వ్యూయర్ షిప్ ను సంపాదించుకొని ట్రెండింగ్ వన్ లో ఉందనే చెప్పాలి. ఇక మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ కి సినిమా అంటే ఎంత ఇష్టమో అలాగే కార్ల కలెక్షన్ అన్న కూడా ఆయనకు చాలా ఇష్టం మార్కెట్లోకి ఏ రకం కొత్త కార్ వచ్చినా కూడా ఆ కార్ తన గరాజ్ లో ఉండాల్సిందే.

    లేకపోతే మాత్రం ఆయన చాలా బాధ పడిపోతుంటాడు ఇక అత్యంత కాస్ట్లీ కార్లు సైతం ఆయన గరాజ్ లో ఉంటాయి. ఇక ఇప్పటికే లంబోర్గిని ఉరస్, రేంజ్ రోవర్ లాంటి కాస్ట్లీ కార్లను కలిగి ఉన్న ఎన్టీఆర్ ఇప్పుడు మళ్లీ మెర్సిడెస్ బెంజ్ మే బ్యాక్ ఎస్ క్లాస్ అలాగే హుండాయి ఎలక్ట్రిక్ 5 బ్లాక్ ను తన గరాజ్ లో చేర్చాడు.

    ఇక మెర్సిడెస్ బెంజ్ బ్లాక్ ఎస్ క్లాస్ ను తనకు నచ్చిన విధంగా డిజైన్ చేయించుకున్నాడు ఇక దీని విలువ అక్షరాల 4 కోట్ల 23 లక్షలు కావడం విశేషం… హుండాయ్ ఎలక్ట్రిక్ ఐకానిక్ కార్ ఖరీదు 55 లక్షలు కావడం విశేషం…ఇక ఇవి అనే కాకుండా చాలా లగ్జరీ కార్లను కొనుగోలు చేసి తన గరాజ్ పెట్టాడు… ఇక ఇదిలా ఉంటే ఆయన హీరో గా చేసిన దేవర సినిమా తొందర్లోనే రిలీజ్ కి రెఢీ అవుతుంది…