NTR Hollywood Entry: ఆర్ ఆర్ ఆర్ మూవీ రామ్ చరణ్, ఎన్టీఆర్ ల ఇమేజ్ ప్రపంచవ్యాప్తం చేసింది. ఆస్కార్ గెలుపుతో హాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని వీక్షించారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ ల పెర్ఫార్మన్స్ కి ఫిదా అయ్యారు. ఈ క్రమంలో ఈ ఇద్దరు హీరోలతో సినిమాలు చేయాలన్న తమ కోరిక బయటపెడుతున్నారు. హీరో రామ్ చరణ్ ఇప్పటికే కొందరు హాలీవుడ్ మేకర్స్ తో చర్చలు జరిగినట్లు చెప్పారు. భవిష్యత్ లో హాలీవుడ్ ఎంట్రీ పై ప్రకటన రానుందని చెప్పారు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ తో మూవీ చేయాలనే ఉద్దేశం ఉందని హాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరైన జేమ్స్ గన్ తన కోరిక బయటపెట్టారు.
ఆర్ ఆర్ ఆర్ హీరో ఎన్టీఆర్ అద్భుతమైన నటుడు. ఆయనతో మూవీ చేసే ఆలోచన ఉందని ఆయన లేటెస్ట్ ఇంటర్వ్యూలో అన్నారు. హాలీవుడ్ టాప్ డైరెక్టర్ గేమ్స్ గన్ చేసిన కామెంట్స్ ఇండియన్ ఫిల్మ్ వర్గాల్లో చర్చకు తెరలేపింది. పలువురు ఎన్టీఆర్ సాధించిన మరొక అచీవ్మెంట్ గా కొనియాడుతున్నారు. జేమ్స్ గన్ గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ సిరీస్ కి దర్శకుఢుగా ఉన్నారు. 2006లో విడుదలైన స్లిథర్ మూవీతో ఆయన దర్శకుడిగా మారారు. డాన్ ఆఫ్ ది డెడ్ చిత్రానికి రచయితగా పనిచేశారు.
ఒకవేళ ఎన్టీఆర్-జేమ్స్ గన్ మూవీ సెట్ అయితే భారీ కాంబో అవుతుంది. ఎన్టీఆర్ మార్కెట్ అండ్ రేంజ్ ఎల్లలు దాటిపోతుంది. అప్పుడు గ్లోబల్ స్టార్ ఇమేజ్ కి సార్ధకత దక్కుతుంది. ఆల్రెడీ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ కన్ఫర్మ్ అయ్యింది. వార్ 2 మూవీలో ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెలిసిందే. హృతిక్ రోషన్-ఎన్టీఆర్ ల మల్టీస్టారర్ గా ఇది తెరకెక్కుతుంది. పార్ట్ 1లో హృతిక్-టైగర్ ష్రాఫ్ నటించారు. సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన వార్ భారీ విజయం సాధించింది.
ప్రస్తుతం ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల శివతో మూవీ చేస్తున్నారు. ఎన్టీఆర్ 30వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. షూటింగ్ నిరవధికంగా జరపాలని డిసైడ్ అయ్యారు. విడుదలకు ఏడాది సమయం మాత్రమే ఉంది. షూటింగ్ పార్ట్ వీలైనంత త్వరగా పూర్తి చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.