Mahesh Babu: షూటింగ్ కి రాను అంటూ త్రివిక్రమ్ కి కొత్త తలనొప్పి తెస్తున్న సూపర్ స్టార్ మహేష్

మహేష్ బాబు కి స్కిన్ ఎలెర్జి ఉంది, ఆయన వేసవి కాలం లో షూటింగ్స్ చెయ్యడు, సినిమా విడుదలకు ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ఒక మూడు నెలలు విరామం ఇవ్వడం వల్ల ఎలాంటి నష్టం ఉండదని, కాబట్టి ఈ మూడు నెలలు షూటింగ్ కి తాత్కాలిక విరామం అడిగినట్టు తెలుస్తుంది.

Written By: Vicky, Updated On : April 26, 2023 1:34 pm

Trivikram Srinivas

Follow us on

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ తో కలిసి ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొంతకాలం క్రితమే రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించుకున్న ఈ సినిమాని, వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదల చెయ్యబోతున్నారు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ ని కూడా ఇటీవలే విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫస్ట్ లుక్ కి ఫ్యాన్స్ నుండే కాదు, ఆడియన్స్ నుండి కూడా అదిరిపొయ్యే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది.

ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ చిత్రం గురించి లేటెస్ట్ గా సోషల్ మీడియా లో వినిపిస్తున్న వార్త అభిమానులను కాస్త నిరాశకి గురి చేస్తుంది. అదేమిటంటే ఈ చిత్రం షూటింగ్ తాత్కాలికంగా ఒక మూడు నెలలు పాటుగా ఆపివేయాలని మహేష్ బాబు త్రివిక్రమ్ కి చెప్పాడట.అందుకు కారణం సమ్మర్ అవ్వడమే అని అంటున్నారు.

మహేష్ బాబు కి స్కిన్ ఎలెర్జి ఉంది, ఆయన వేసవి కాలం లో షూటింగ్స్ చెయ్యడు, సినిమా విడుదలకు ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ఒక మూడు నెలలు విరామం ఇవ్వడం వల్ల ఎలాంటి నష్టం ఉండదని, కాబట్టి ఈ మూడు నెలలు షూటింగ్ కి తాత్కాలిక విరామం అడిగినట్టు తెలుస్తుంది. ఈ మూడు నెలలు మహేష్ బాబు తన పెళ్ళాం పిల్లలతో కలిసి ఫారిన్ టూర్ కి ప్లాన్ చేస్తున్నాడట. మహేష్ కి టూర్స్ వెయ్యడం అంటే ఎంతో ఇష్టం అనే విషయం అందరికీ తెలిసిందే,ఏడాదికి ఆయన వంద రోజులు షూటింగ్స్ చేస్తే మిగిలిన 264 రోజులు ఫారిన్ ట్రిప్స్ లోనే ఉంటాడు.

ఇది ఇలా ఉండగా ఇంకా సెట్స్ మీద ఉన్న మహేష్ – త్రివిక్రమ్ మూవీ కి ట్రేడ్ లో మామూలు క్రేజ్ లేదు, ఇప్పటికే ఈ చిత్రం USA రైట్స్ 4 మిలియన్ డాలర్స్ కి అమ్ముడుపోయిందట,మిగిలిన ప్రాంతాలకు కూడా క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి కానీ, మరింత ఎక్కువ ఆఫర్స్ వచ్చేవరకు బిజినెస్ ప్రారంభించకూడదని నిర్మాత సూర్యదేవర నాగవంశీ చూస్తున్నాడట.