NTR’s EMK Show: రాజమౌళి ముందు.. ఎన్టీఆర్ ను కొట్టేశారా?

NTR’s EMK Show: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా బుల్లితెరపై యమ రంజుగా సాగుతోంది ‘మీలో ఎవరు కోటీశ్వరులు’ రియాలిటీ షో. తనదైన శైలిలో షోను రక్తికట్టిస్తూ ముందుకు తీసుకెళుతున్నాడు ఎన్టీఆర్. మంచి రేటింగ్ సొంతం చేసుకున్న ఈ షోకు తెలుగు సినిమా రంగంలో అపజయం ఎరుగని దర్శకులు రాజమౌళి, కొరటాల శివ స్పెషల్ గెస్టులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు.. వారిని ఆటపట్టిస్తూ.. ఉడికిస్తూ.. విసిగిస్తూ ఎన్టీఆర్ […]

Written By: NARESH, Updated On : September 21, 2021 5:26 pm
Follow us on

NTR’s EMK Show: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా బుల్లితెరపై యమ రంజుగా సాగుతోంది ‘మీలో ఎవరు కోటీశ్వరులు’ రియాలిటీ షో. తనదైన శైలిలో షోను రక్తికట్టిస్తూ ముందుకు తీసుకెళుతున్నాడు ఎన్టీఆర్. మంచి రేటింగ్ సొంతం చేసుకున్న ఈ షోకు తెలుగు సినిమా రంగంలో అపజయం ఎరుగని దర్శకులు రాజమౌళి, కొరటాల శివ స్పెషల్ గెస్టులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు.. వారిని ఆటపట్టిస్తూ.. ఉడికిస్తూ.. విసిగిస్తూ ఎన్టీఆర్ చేసిన హోస్టింగ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.

అయితే ఈ షోలో ఎన్టీఆర్ అందరినీ ఆటపట్టిస్తూ ఓ ఆట ఆడుతుండగా.. ఎన్టీఆర్ నే రకరకాలుగా విసిగించి కొన్ని తప్పులను రాజమౌళి ఎత్తి చూపి షాకిచ్చాడు. ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ పూర్తికాలేదని.. నిన్ను వదలను తారక్ అని రాజమౌళి అనడంతో ఎన్టీఆర్ గట్టిగా వామ్మో అని అరిచేశాడు. ‘ఆర్ఆర్ఆర్’ కోసం షూటింగ్ లో మమ్మల్ని టార్చర్ చేసిన రాజమౌళిని ఇప్పుడు నేను టార్చర్ చేస్తాను అని ఎన్టీఆర్  బెదిరించాడు. కానీ రాజమౌళి బెదరలేదు.. ఎన్టీఆర్ కే ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ సమాధానాలు ఇస్తూ ఆకట్టుకున్నాడు.

ఎన్టీఆర్ ఒక ప్రశ్నను తప్పుగా అడగ్గా రాజమౌళి దాన్ని కరెక్ట్ చేయడం విశేషం. ‘చిన్నదేవి, తిరుమల దేవి వీరిలో ఏ పాలకుడి రాణులు’ అంటూ ప్రశ్న వచ్చింది. ఈ ప్రశ్నకు రాజమౌళి ఠక్కున సమాధానం ‘శ్రీకృష్ణదేవరాయలు’ అని చెబుతాడు. అయితే చిన్నదేవి కాదని.. ఆమె పేరు చెన్నదేవి అంటూ రాజమౌళి ఏకంగా ఎన్టీఆర్ నే తప్పుడు ప్రశ్న అడిగావని సెటైర్ వేస్తాడు.. ‘దీంతో మా గురువు గారినే తప్పుపడుతావా?’ అని ఎన్టీఆర్ సెటైర్లు వేస్తాడు.

ఇక అస్సలు టైం గురించి పట్టింపు లేని మనిషి రాజమౌళి అంటూ ఎన్టీఆర్ సైటర్లు వేస్తాడు.. సినిమాలు ఏళ్లకు ఏళ్లుగా తీస్తుంటారు అని ఎద్దేవా చేశారు. దీనికి నాకు ‘టెన్షన్ ఉంటుంది’ అని రాజమౌళి అనడంతో.. ‘ఏంటి సార్ మీకు టెన్షనా? సార్ సార్’ అంటూ రాజమౌళిని ఎన్టీఆర్ ఆటపట్టించాడు.

ఇక షో మధ్యలో కామిక్ స్టోరీలపై సందర్భం వచ్చింది. ఈ క్రమంలోనే తన కుమారుడు టీవీ చూస్తూ అందులో లీనమైపోయి తనను కొడుతాడని.. ఒక సారి తల బొప్పి కట్టిందని.. వాడు మరీ నాటు.. వాళ్ల అమ్మపోలిక అంటూ ఎన్టీఆర్ తన కొడుకు చేష్టలపై షోలో చెప్పుకొచ్చాడు. దీనికి కొరటాల కూడా అందుకున్నారు.. ‘ఇటీవల చిరంజీవి మనవరాలు కూడా ఇలానే ఆయనను కొట్టిందట.. ఐస్ బ్యాగులు పెట్టుకున్నాడట’ అంటూ చెప్పడంతో ఎన్టీఆర్, రాజమౌళి, కొరటాల ముగ్గురు నవ్వేశారు. ఇలా పిల్లల అల్లరికి ఎన్టీఆర్, చిరంజీవి బాధితులుగా మారారన్న మాట.. ఏకంగా ఎన్టీఆర్ నే ఆయన కొడుకు కొట్టిన వైనం నవ్వులు పూయించింది.

ఇక కొరటాల శివ, రాజమౌళి జవాబులు ఇవ్వకముందే గుసగుసలాడుకోవడంపై ఎన్టీఆర్ చిలిపిగా వార్నింగ్ లు ఇస్తూ ఆటపట్టించాడు. కాసేపు గొడవపడ్డారు. ఇది అన్యాయం అంటూ ఎన్టీఆర్ అల్లరి చేశాడు. మొత్తంగా ఈ సోమవారం ప్రసారమైన షోలో రాజమౌళి, కొరటాల శివలతో ఎన్టీఆర్ ఆడుకున్న తీరు ప్రేక్షకులకు బాగా ఎంటర్ టైన్ మెంట్ పంచిందని చెబుతున్నారు.