https://oktelugu.com/

KTR vs Revanth: రేవంత్ రెడ్డిపై కేటీఆర్ పరువునష్టం దావా.. సిటీ కోర్టులో విచారణ

కాంగ్రెస్, టీఆర్ ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. గజ్వేల్ సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మంత్రి కేటీఆర్ టార్గెట్  గా వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసు నేపథ్యంలో రేవంత్ వైట్ ఛాలెంజ్ పేరిట మంత్రి కేటీఆర్ పై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ రేవంత్ రెడ్డికి సవాలు విసిరారు. తాను పరీక్షలకు సిద్ధమని రాహుల్ గాంధీ రెడీనా అని ప్రశ్నించారు. ఈ క్రమంలో కేటీఆర్ ట్వీటర్ […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : September 21, 2021 5:32 pm
    Drugs case
    Follow us on

    Drugs case

    కాంగ్రెస్, టీఆర్ ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. గజ్వేల్ సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మంత్రి కేటీఆర్ టార్గెట్  గా వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసు నేపథ్యంలో రేవంత్ వైట్ ఛాలెంజ్ పేరిట మంత్రి కేటీఆర్ పై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ రేవంత్ రెడ్డికి సవాలు విసిరారు. తాను పరీక్షలకు సిద్ధమని రాహుల్ గాంధీ రెడీనా అని ప్రశ్నించారు.

    ఈ క్రమంలో కేటీఆర్ ట్వీటర్ వేదికగా రేవంత్ వ్యాఖ్యలపై స్పందించారు. ఢిల్లీ ఎయిమ్స్ లో ఏ రకమైన పరీక్షకైనా నేను సిద్ధమే రాహుల్ వస్తాడా చరల్లపల్లి బ్యాచ్ తో నేను టెస్టులు చేసుకుంటే నా గౌరవం తగ్గుతుంది. నాకు క్లీచ్ చిట్ వస్తే పదవికి రాజీనామా చేసి రేవంత్ క్షమాపణ చెస్తాడా ఓటుకు కోట్ల కేసులో లై డిటెక్టర్ పరీక్షకు రేవంత్ సిద్ధమా అని కేటీఆర్ ప్రశ్నించాడు.

    అయితే రేవంత్ రెడ్డి పై కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా పిటిషన్ పై సిటీ సివిల్ కోర్టులో విచారణ జరిగింది. పరువు నష్టం దావాలో ఇంజెక్షన్ ఆర్డర్ పై వాదనలు ముగిశాయి. వాదలను ముగియడంతో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కేటీఆర్ న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై మరికాసేట్లో న్యాయస్థానం తీర్పు వెల్లడించే అవకాశాలున్నాయి.