https://oktelugu.com/

Prakash Javadekar: ఇక టీఆర్ఎస్ తో ఉద్యమమే.. ప్రకాశ్ జవదేకర్

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తో జరిగేది ఉద్యమమేనని బీజేపీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర కామారెడ్డి జిల్లాలో జరుగుతోంది. ఈ సందర్భంగా సంగ్రామ యాత్రలో పాల్గొన్న ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ తెలంగాణలో ప్రజా పాలన నడవడం లేదని, కేవలం కుటుంబ పాలన నడుస్తోందని ధ్వజమెత్తారు. సీఎం పీఠం ఎక్కగానే కేసీఆర్ హామీలను మర్చిపోయారని విమర్శించారు. ఏడేళ్ల పాలనలో ఉద్యోగాలు […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : September 21, 2021 / 05:13 PM IST
    Follow us on

    రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తో జరిగేది ఉద్యమమేనని బీజేపీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర కామారెడ్డి జిల్లాలో జరుగుతోంది. ఈ సందర్భంగా సంగ్రామ యాత్రలో పాల్గొన్న ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ తెలంగాణలో ప్రజా పాలన నడవడం లేదని, కేవలం కుటుంబ పాలన నడుస్తోందని ధ్వజమెత్తారు.

    సీఎం పీఠం ఎక్కగానే కేసీఆర్ హామీలను మర్చిపోయారని విమర్శించారు. ఏడేళ్ల పాలనలో ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజల్ని మభ్యపెడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అవినీతి అక్రమాల పాలన సాగిస్తున్నారన్నారు.

    కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడ్డక రాష్ట్రాలకు నిధులు పెంచారని ఆయన తెలిపారు. తెలంగాణలో హైవేల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. యాత్ర ద్వారా ప్రజా సమస్యలను బండి సంజయ్ తెలుసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో వచ్చే ప్రభుత్వం బీజేపీదేనని ఆయన అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తామని ప్రకాశ్ జవదేకర్ ధీమా వ్యక్తం చేశారు.