NTR Devara: దేవర చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ఆచార్య ఫెయిల్యూర్ తో విమర్శల పాలైన కొరటాల దేవరతో కమ్ బ్యాక్ కావాలనుకుంటున్నాడు. సక్సెస్ ట్రాక్ ఎక్కాలని గట్టిగా ట్రై చేస్తున్నాడు. అనుకోని కారణాలతో మూవీ ఆలస్యమైంది. ప్రణాళిక ప్రకారం షూటింగ్ మొదలు కాలేదు. అయితే వరుస షెడ్యూల్స్ తో షూటింగ్ పరుగులు పెట్టిస్తున్నారు. దేవర షూటింగ్ శరవేగంగా సాగుతుంది. విడుదలకు కేవలం 10 నెలల సమయం మాత్రమే ఉంది. అందుకే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మూవీ చేస్తున్నారు.
ఇక దేవర సినిమాకు యాక్షన్ ఎపిసోడ్స్ ప్రధాన ఆకర్షణ కానున్నాయి. కరుడుగట్టిన విలన్స్ ని భయపెట్టే వాడిగా ఎన్టీఆర్ పాత్ర ఉంటుందని దర్శకుడు కొరటాల ఇప్పటికే చెప్పారు. ఇక దేవర పూర్తిగా సముద్రం నేపథ్యంలో సాగుతుంది. సాగరతీరం మీద ఆధిపత్యం కోసమే జరిగే యుద్ధంగా దేవర ఉండనుంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ కీలక అంశం తెరపైకి వచ్చింది. దర్శకుడు కొరటాల శివ సొరచేపతో యాక్షన్ ఎపిసోడ్ ప్లాన్ చేస్తున్నాడట.
నడి సముద్రంలో ఎన్టీఆర్ సొరచేపతో తలపడతాడట. ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకే హైలెట్ గా నిలవనుందని అంటున్నారు. ఎన్టీఆర్ జాలరి పాత్ర చేస్తున్నాడట. చేపల వేట క్రమంలో ఈ ఫైట్ సీన్ వస్తుందని ప్రచారం జరుగుతుంది. దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా ప్రచారం అవుతుంది.
దేవర చిత్రాన్ని దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ కి జంటగా జాన్వీ కపూర్ నటిస్తుంది. ఆమెకు ఇది ఫస్ట్ సౌత్ ఇండియన్ మూవీ. శ్రీదేవి వారసురాలిగా ఆమెకు తెలుగు తమిళ భాషల్లో క్రేజ్ ఉంది. ఎన్టీఆర్-జాన్వీ కపూర్ జంటను సిల్వర్ స్క్రీన్ పై చూడాలని ఫ్యాన్స్ ఆతృతగా ఉన్నారు. సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ చేస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. దేవర ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది.
Latest buzz is that #Devara will have an action sequence between Shark🦈 and #NTR.
This is said to be the biggest HIGHLIGHT of the movie.
TARAQUAMAN pic.twitter.com/oKj3U4Sfbe
— Manobala Vijayabalan (@ManobalaV) August 7, 2023