Bhola Shankar Vs Jailer: అడ్వాన్స్ బుకింగ్స్ లో రజనీ వర్సెస్ చిరంజీవి..నువ్వా? నేనా?

మెగాస్టార్ లేటేస్టుగా నటిస్తున్న మూవీ ‘భోళా శంకర్’ .ఈ మూవీని ఆగస్టు 11న రిలీజ్ చేస్తున్నారు. సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో వస్తున్న ఈ మూవీ తమిళ రీమేక్ అయినా తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా తీర్చి దిద్దామని చిత్ర బృందం తెలుపుతోంది.

Written By: Chai Muchhata, Updated On : August 8, 2023 9:19 am

Bhola Shankar Vs Jailer

Follow us on

Bhola Shankar Vs Jailer: 2023 సంక్రాతికి ఇద్దరు టాలీవుడ్ లెజెండ్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఒకటి మెగాస్టార్, మరొకిటి నందమూరి బాలకృష్ణ సినిమాలు వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలు వచ్చి సందడి చేశాయి. నువ్వా, నేనా అన్న రేంజ్ లో థియేటర్లోకి వచ్చి ప్రేక్షకుల్లో ఊపు తెచ్చాయి. అయితే కొన్ని రోజులుగా సినిమా థియేటర్లలో కళ తప్పినట్లయింది. ఇప్పుడు మళ్లీ ఆగస్టులో సినీ వార్ జరగబోతుంది. ఈసారి ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతున్నాయి. ఒకటి మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ కాగా..మరొకటి సూపర్ స్టార్ రజనీకాంత్ ‘జైలర్’.. ఒకరోజు తేడాతో థియేటర్లోకి ఇవి రావడంతో ఆడియన్స్ లో ఉత్కంఠ నెలకొంది. అసలు విషయానికొస్తే ఈ సినిమాలకు ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ జోరందుకున్నాయి. పోటా పోటీగా ఫ్యాన్స్ బుక్ చేసుకున్నారు. ఇప్పటికే ఎన్ని కోట్లు వసూలయ్యాయంటే?

మెగాస్టార్ లేటేస్టుగా నటిస్తున్న మూవీ ‘భోళా శంకర్’ .ఈ మూవీని ఆగస్టు 11న రిలీజ్ చేస్తున్నారు. సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో వస్తున్న ఈ మూవీ తమిళ రీమేక్ అయినా తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా తీర్చి దిద్దామని చిత్ర బృందం తెలుపుతోంది. ఇక ఈ మూవీ రీమేక్ అయినా తెలుగు ప్రేక్షకులను అరిస్తుందని స్వయంగా మెగాస్టార్ చెప్పడంతో దీనిపై హోప్స్ మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో సినిమాను 223 షోల ద్వారా ప్రదర్శించనున్నారు. దీంతో ఇప్పటికే 45 శాతం ఆక్యుపెన్సీ పెరిగింది. ఈ మూవీకి అడ్వాన్స్ బుకింక్స్ ద్వారా ఇప్పటికే రూ.కోటి రూపాలయు వసూలయ్యాయి. మరో రెండు రోజులు ఉంది కాబట్టి మరిన్ని పెరిగే అవకాశం ఉంది.

రజనీకాంత్ నటిస్తున్న మూవీ ‘జైలర్’ ను ఒకరోజు ముందు అంటే ఆగస్టు 10న రిలీజ్ చేస్తున్నారు. ట్రైలర్ తో ఆకట్టుకుంటున్న జైలర్ మూవీ కూడా మెప్పిస్తుందని ఫ్యాన్స్ ఖుషీ అవుతునారు. ఈ నేపథ్యంలో సినిమాను ఫస్ట్ డే నాడే చూసేందుకు అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారు. ‘జైలర్’కు ఓవర్సీస్ నుంచి స్సందన వస్తోంది. మలేషియాలో ఈ సినిమా 265 షోలు ప్రదర్శిస్తున్నారు. దీంతో ఇప్పటికే రూ.46 లక్షలు వసూలయ్యాయి. యూకేలో రూ.60 లక్షలు వసూలు చేసింది. హైదరాబాద్ లోనూ భారీ ఓపెనింగ్స్ ఉన్నాయి. దీనిని 325 షోల్లో ప్రదర్శిస్తున్నారు. దీంతో 38 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. తొలిరోజు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా రూ.కోటి వసూలైంది.

ఒకరికంటే మరొకరు ఎక్కువ అన్న రేంజ్ లో ఓపెనింగ్స్ లోనే స్టార్ హీరోల సినిమాలు అదరగొడుతున్నాయి. అయితే మెగాస్టార్ చిరంజీవి లోకల్ గా హై పోజిషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 11న సంబరాలు చేసేందుకు రెడీగా ఉన్నారు. సినిమా ఫస్ట్ లుక్ తో పాటు ట్రైలర్ ఆకట్టుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు నమోదయ్యాయి. మరోవైపు ఇందులో మెగాస్టార్ స్లిమ్ గా కుర్రాడిలా కనిపించడంతో యూత్ లో జోష్ పెరిగింది.