NTR: విశ్వ విఖ్యాత నట సార్వభౌమ ‘ఎన్టీఆర్ 26వ వర్ధంతి’ నేడు. తెలుగోడి ఖ్యాతిని విశ్వవ్యాపితం చేసిన ఆయన వర్ధంతి వేడుకలను ఎన్టీఆర్ అభిమానులు టీడీపీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. తెలుగుజాతి వాడిని, వేడిని, పౌరుషాన్ని, తెగువని ప్రపంచపు నలుమూలలా చాటిచెప్పి.. కులం, మతం, ప్రాంతం మరియూ రాజకీయ పార్టీలకు అతీతంగా అభిమానుల్ని సంపాదించుకున్న ఘనత ఒక్క ఎన్టీఆర్ కి మాత్రమే సాధ్యం అయింది.

.
ఆయన్ని ‘భారతరత్న’ బిరుదాంకితుడిగా చూడాలన్న తెలుగువాళ్ళ చిరకాల స్వప్నం సాకారం చేయాలనీ.. ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న అసంఖ్యాక తెలుగు వారందరూ బలంగా కోరుకుంటున్నారు. 1923 మే 23న కృష్ణా జిల్లాలోని నిమ్మకూరు గ్రామంలో చిన్న వ్యవసాయ కుటుంబంలో ఎన్టీఆర్ గారు జన్మించారు. ఆయన 320 కి పైగా చిత్రాల్లో నటించారు. 1949 లో ‘మనదేశం’ చిత్రంతో చలనచిత్ర రంగ ప్రవేశం చేసి వైవిధ్యవంతమైన పాత్రలు పోషించి తెలుగువారి అభిమానాన్ని చూరగొన్నారు. ఇప్పటికి ‘నటరత్న’గా మన్ననలు పొందుతూ తెలుగు జాతి ఉన్నంత కాలం చిరస్థాయిగా నిలిచిపోతారు.

ఎన్టీఆర్.. పౌరాణిక పాత్రలు శ్రీ కృష్ణుడు, శ్రీ రాముడు, దుర్యోధనుడు, భీష్ముడు, భీముడు, రావణాసురుడు ఇత్యాదులెన్నో అసమాన రీతిలో పోషించి పండిత పామరుల గుండెలలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న మహానటుడు ఆయన. అందుకే ఎన్టీఆర్ గురించి ఓ ప్రత్యేక గీతం.
Also Read: చీరకట్టులో, మోడ్రన్ డ్రెస్సులో హోయలు పోతున్న భామలు..!
తెలుగు జాతి ఉనికి..
తెలుగు జాతి తేజం..
తెలుగు జాతి రౌద్రం..
తెలుగు జాతి పౌరుషం..
తెలుగు జాతి ప్రతాపం..
ప్రపంచానికి తెలియజేసిన
తెలుగు జాతి సమున్నత శిఖరం..!
విశ్వవిఖ్యాత
నటసార్వభౌమ
నటరత్న, పద్మశ్రీ
డా.ఎన్.టి.రామారావు గారి
26వ వర్ధంతి సందర్భంగా
వారికి నివాళి తెలియజేయటం
ప్రతి ఒక్క తెలుగువారి ధర్మం..!
చలనచిత్ర సీమలో తిరుగులేని రారాజుగా,
నిరుపేదల పాలిట ఆత్మబంధువుగా,
సాధారణ పౌరుల్లో రాజకీయ చైతన్యం
రగిలించిన సంచలన నాయకుడిగా
ప్రజల మనసుల్లో నిలిచిన
ఓ మహనీయుడా..!
వంగి వంగి సలాములు చేసే
బానిస సంస్కృతిని తుంగలో తొక్కి,
మడమతిప్పని నైజంతో తెలుగు జాతికి
కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చిన
ఓ యుగపురుషుడా..!!
నీ లోటుతో తెలుగుదనం తలవొంచుతోంది.
తెలుగు జాతి తల్లడిల్లుతోంది..
తెలుగు ప్రజలు పిలుస్తున్నారు..
రా.. మళ్లీ రా..!!
Also Read: ఏపీలో కరోనా కల్లోలానికి నిదర్శనం ఇదీ!
[…] […]