Corona Effect: కరోనా మహమ్మారి దాదాపు ప్రపంచం మొత్తం చుట్టేసింది. పేద, ధనిక అని తేడా లేకుండా అందరికీ అంటేసింది. ఈ నేపథ్యంలో వైరస్ ను అరికట్టేందుకు ప్రపంచ దేశాలు లాక్డౌన్ ను విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ లాక్డౌన్ తో ఎవరు నష్టపోయారు..? అంటే.. పేదవారే అని చెబుతోంది ఆక్స్ ఫామ్ సంస్థ. గత రెండేళ్లలో ఆయా దేశాలను వణికించిన కరోనా పేదలను మరింత పేదలుగా తయారు చేస్తే.. ధనికులను మరింత కుభేరులుగా చేసిందని ఈ సంస్థ తెలుపుతోంది. 2021 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా రోజుకు 21 వేల మంది మరణిస్తే ఇందులో పేదవారే ఎక్కువగా ఉన్నారని ‘ఆక్స్ ఫామ్’ తెలిపింది. ఇక ఇండియా విషయానికొస్తే ఈ సంవత్సరంలో 84 శాతం మంది ఆదాయం పడిపోగా.. 102 మంది బిలియనీర్ల సంఖ్య 142కు పెరిగింది.

కొవిడ్-19 భారత్ ను విడిచిపెట్టలేదు. కోట్ల కొద్ది కేసులు, లక్షల కొద్ది ప్రాణాలను బలి తీసుకుంది. దీంతో దేశ ఆర్థిక రంగం కుదేలయింది. అయితే 2020-21 బడ్జెట్లో ఆరోగ్య శాఖ కు కేటాయింపులను ప్రభుత్వం తగ్గించింది. అలాగే విద్యారంగం, సామాజిక భద్రత పథకాలకూ కేటాయింపులో 6 శాతానికి తగ్గించిందని ‘ఆక్స్ ఫామ్’ తెలిపింది. కానీ ఇదే సమయంలో 100 మంది అత్యంత సంపన్నుల ఉమ్మడి ఆదాయం ఈ సంవత్సరంలో 57.3 లక్షల కోట్లకు పెరిగింది. మహమ్మారి కాలంలో బిలియనీర్ల సంపద 23.14 లక్షల కోట్ల నుంచి 53.16 లక్షల కోట్లకు పెరిగింది.
భారత్లో ఎప్పటి నుంచో ఉన్న ధనవంతులు ఇప్పటికీ వారి కుటుంబాలు ధనవంతులుగానే కొనసాగుతున్నారు. అమెరికా, చైనా తరువాత భారత్లోనే బిలియనీర్లు ఎక్కువగా ఉన్నారు. భారత్లోని 100 మంది బిలియనీర్ల సంపద పెరుగుదలలో దాదాపై ఐదో వంతు అదానీదేనని ఆక్స్ ఫామ్ సంస్థ తెలిపింది. ప్రపంచ కుభేరుల్లో గౌతమ్ అదానీ 24వ స్థానంలో ఉన్నారు. 2020లో ఆయన సంపద 890 కోట్ల డాలర్లు కాగా.. 2021లో 5,500 కోట్ల డాలర్లకు పెరిగింది. భారత్లో కొవిడ్ తో మిగతా రంగాలు కుదేలవుతున్నా.. అదాని సంపద మాత్రం అమాంతం పెరిగింది. అయితే ఆయన ఆస్ట్రేలియాలో కొత్తగా కొన్న కెమికల్ గనులు, ముంబై విమానాశ్రయంలో 74 శాతం వాటా దక్కించుకోవడం వంటివి ఆయన సంపద పెరుగుదలలో ఉన్నాయి.
ఇదిలా ఉండగా భారత్లో పేదరికం రోజురోజుకూ మరింత పెరుగుతోంది. ఓ వైపు ప్రభుత్వానికి పరోక్ష పన్నులు, ఇతర మార్గాల ద్వారా ఆదాయం వస్తున్నా.. వాటిని సామాజిక అభివృద్ధికి ఉపయోగించలేదని కొందరు వాదిస్తున్నారు. 2021 తొలి ఆరునెలల్లో ఇండియాకు చమురు మీదే 33 శాతం అధికంగా పన్ను వచ్చింది. ఇంక ద్రవ్యోల్భనం తదితర మార్గాల ద్వారా పేదలు న్యాయంగా ప్రభుత్వానికి సరైన పన్నులు చెల్లిస్తున్నారు. కానీ ధనవంతులకు సంబంధించిన సంపద పన్నును ప్రభుత్వం రద్దు చేసింది. అలాగే వారి నుంచి పెట్టుబడులను ఆకర్షించేందుకు 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించడం వల్ల 1.5 లక్షల కోట్ల ఆదాయం కోల్పోయినట్లయింది.
కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా 16 కోట్ల మంది కొత్తగా నిరుపేదలయ్యారు. కానీ ఇదే సమయంలో రోజుకో బిలియనీర్ ఆవిర్భవించాడు. మహమ్మారితో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో జాతీయ అప్పులు పెరగగా..అవి సామాజిక వ్యాయాన్ని తగ్గించాల్సి వచ్చింది. కానీ 10 మంది సంపన్నుల ఆదాయం మొత్తం 2020 మార్చి నుంచి రెట్టింపు అయింది. దావోస్లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు ప్రారంభానికి ముందు ప్రపంచ అసమానతలపై ఆక్స్ ఫామ్ తన నివేదికను విడుదల చేస్తుంది. అయితే ఈ సదస్సు ఈసారి కూడా వర్చువల్ గానే నిర్వహించే అవకాశం ఉంది. ఈ వారంలో జరిగే ఈ సదస్సు సందర్భంగా ఆక్స్ ఫామ్ ఈ నివేదికలను బయటపెట్టింది.
[…] Wine shops: మడమ తిప్పను, మాట తప్పను.. ఈ మాటలు జగన్ ఎన్నికలకు ముందు తన పాదయాత్రలో పదే పదే వినిపించారు. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో మద్య పాన నిషేధం వందశాతం చేసి చూపిస్తామంటూ ప్రకటించారు. కానీ చాలా విషయాల్లో మడమ తిప్పేస్తున్నట్టే… మద్యం విషయంలో కూడా మడమ తిప్పేస్తున్నారు జగన్. మద్యపాన నిషేధం విషయంలో మెల్లిమెల్లిగా వెనకడుగు వేస్తూ పాత పరిస్థితులను తీసుకొస్తున్నారు. […]
[…] Dhanush – Aishwarya: సినిమా పరిశ్రమలో ఇప్పుడు విడాకులు సర్వసాధారణం అయిపోయాయి. తాజాగా తమిళ హీరో ధనుష్, సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య దంపతులు విడిపోతున్నట్లు ప్రకటించడం అందర్నీ షాక్ కి గురి చేసింది. తమ 18 ఏళ్ల వైవాహిక బంధానికి వాళ్ళు ముగింపు పలుకుతూ ఓ ఉమ్మడి లేఖను కూడా రిలీజ్ చేశారు. “18 ఏళ్లపాటు స్నేహితులుగా, భార్యభర్తలుగా, తల్లిదండ్రులుగా, శ్రేయోభిలాషులుగా అర్ధం చేసుకొని మా ప్రయాణాన్ని సాగించాము. […]