War 2 Jr NTR Shock : ఎన్టీఆర్(Junior NTR), హృతిక్ రోషన్(Hrithik Roshan) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘వార్ 2′(War 2 Movie) చిత్రం షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఆగష్టు 14 న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ తో అగ్రీమెంట్స్ కూడా పూర్తి చేసుకుంటున్నారు నిర్మాతలు. రీసెంట్ గానే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్ కి ఎలాంటి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చిందో మనమంతా చూసాము. ఈ చిత్రం లో ఆయన నెగటివ్ రోల్ చేస్తున్నాడని, హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్నాడని అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించిన ఒక లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు అభిమానులను కంగారు పెడుతోంది. ‘వార్ 2’ ఓపెనింగ్స్ పై ఇది చాలా తీవ్రమైన ప్రభావం చూపిస్తాడని అంటున్నారు.
వివరాల్లోకి వెళ్తే నార్త్ అమెరికా లో ప్రీమియర్ షోస్ అనేవి సర్వసాధారణం. ఎన్నో ఏళ్ళ నుండి ప్రతీ తెలుగు సినిమాకు ప్రీమియర్ షోస్ పడుతూనే ఉంటుంది. కానీ బాలీవుడ్ లో ఈ ప్రీమియర్ షోస్ కి ఉన్న డిమాండ్ చాలా తక్కువ. ‘వార్ 2’ బాలీవుడ్ చిత్రం కాబట్టి ఈ సినిమాకు ప్రీమియర్ షోస్ ఉండవని అధికారికంగా ఓవర్సీస్ బయ్యర్స్ కి తెలిపింది యాష్ రాజ్ సంస్థ. మొదటి రోజు నుండే షోస్ షెడ్యూల్ అవుతాయట. ఇది ఎన్టీఆర్ అభిమానులకు కోలుకోలేని షాక్ అనొచ్చు. ఎందుకంటే ప్రీమియర్ షోస్ ద్వారా ఎన్టీఆర్ సినిమాలకు భారీ వసూళ్లు వస్తుంటాయి. గత ఏడాది విడుదలైన ‘దేవర’ చిత్రానికి ప్రీమియర్ షోస్ నుండి 2.8 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అలాంటి పొటెన్షియల్ ‘వార్ 2’ చిత్రానికి కూడా ఉంటుందని, ప్రీమియర్ షోస్ ఉండవని అంటున్నారని, దయచేసి దానిని వృధా చేయొద్దు అంటూ అభిమానులు ప్రాధేయపడుతున్నారు.
Also Read : వార్ 2 మూవీ రిలీజ్ తర్వాత జరిగేది ఇదేనా..?
మరి మేకర్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రిక్వెస్ట్ ని పరిగణలోకి తీసుకొని ప్రీమియర్ షోస్ వేస్తారా లేదా అనేది చూడాలి. అయితే ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో ఏ నిర్మాత కొనుగోలు చేయలేదు. కేవలం యాష్ రాజ్ సంస్థ డైరెక్ట్ గా ఈ చిత్రాన్ని విడుదల చేస్తుంది. దీనిపై సోషల్ మీడియా లో ఇతర హీరోల అభిమానుల నుండి తీవ్రమైన ట్రోల్స్ వస్తున్నాయి. ఇక ఈ సినిమా విశేషాలకు వస్తే ఇందులో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య వచ్చే పోరాట సన్నివేశాలు అభిమానులకు గూస్ బంప్స్ రప్పించే విధంగా ఉంటుందట. అదే విధంగా ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య వచ్చే ఒక పాట నాటు నాటు రేంజ్ లో ఉంటుందని టాక్. సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని, అభిమానులు మళ్ళీ గర్వపడే స్థాయిలో ఈ చిత్రం ఉంటుందని, ఎన్టీఆర్ కి బాలీవుడ్ లో మంచి మార్కెట్ ని ఏర్పాటు చేస్తుందని అంటున్నారు విశ్లేషకులు.