NTR-Trivikram Movie Latest Updates: మాటల మాంత్రికుడిగా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas)… ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. దానికి తగ్గట్టుగానే ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో చాలా వరకు మంచి కథలను ఎంచుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ఇక అల్లు అర్జున్ (Allu Arjun) తో ఆయన ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నాడు అంటూ గతంలో చాలా వార్తలైతే వచ్చాయి. కానీ అల్లు అర్జున్ మాత్రం అట్లీ (Atlee) డైరెక్షన్లో సినిమా చేయడానికి ఆసక్తి చూపించడం విశేషం…ఇక త్రివిక్రమ్ కి అల్లు అర్జున్ కోసం వెయిట్ చేసేంత ఓపిక లేకపోవడంతో ఈ సినిమా స్టోరీ ని ఎన్టీఆర్ కి చెప్పి అతన్ని ఒప్పించాడు. దాంతో వీళ్ళ కాంబినేషన్లో సినిమా రాబోతుంది అంటూ ఈ మూవీ ప్రొడ్యూసర్ అయిన నాగ వంశీ (Naga Vamshi) ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.
మొత్తానికైతే ఇది కుమారస్వామి జీవిత కథ ఆధారంగా తెరకెక్కబోతుంది అంటూ వార్తలైతే వస్తున్నాయి. మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా దాదాపు 800 కోట్ల వరకు బడ్జెట్ కేటాయిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో వచ్చే ఇంటర్వెల్ బ్యాంగ్ కోసం ఏకంగా 40 కోట్లు ఖర్చు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది… ఇండియాలోనే అత్యంత ఎక్కువ బడ్జెట్ పెడుతున్న సినిమాల్లో ఈ సినిమా కూడా ఒకటి కావడం విశేషం…
ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కుమారస్వామిగా నటించబోతున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధిస్తే వీళ్ళిద్దరి కెరియర్ కి కూడా చాలా వరకు హెల్ప్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. ప్రస్తుతం ఇప్పటివరకు త్రివిక్రమ్ కి పాన్ ఇండియాలో మార్కెట్ అయితే లేదు. మరి ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది.
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడున్న యంగ్ డైరెక్టర్లు సైతం భారీ మార్కెట్ ను క్రియేట్ చేసుకుంటున్న నేపధ్యంలో త్రివిక్రమ్ ఇప్పటివరకు ఇంకా తన మార్కెట్ ని ఓపెన్ చేయకపోవడం నువ్వు నన్ను తీవ్రంగా నిరాశపడుతుంది. మరి దాంతో ఇప్పుడు ఈ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ ను కొల్లగొట్టాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది… చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది…