https://oktelugu.com/

Hyderabad: ఒకటి కాదు.. రెండు కాదు.. 418 రాళ్లు వెనకేసుకున్నాడు

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న హైదారబాద్‌ సోమాజిగూడలోని ఏసియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ నెఫ్రాలజీ అండ్‌ యూరాలజీ ఆస్పత్రిలో ఓ 60 ఏళ్ల వృద్ధుడు చేరాడు. అతని కిడ్నీ దెబ్బతిన్నటుల వైద్యులు నిర్ధారించారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : March 14, 2024 / 10:40 AM IST

    Hyderabad

    Follow us on

    Hyderabad: వయసులో ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని అని చెబుతారు పెద్దలు. ఇక్కడ రాళ్ల అంటే రూపాయలు అని అర్థం. కానీ ఇక్కడ ఓ వ్యక్తి నిజంగానే రాళ్లు వెనకేసుకున్నాడు. అవీ నాలుగు కాదు.. 418 రాళ్లు. తన కిడ్నీలో 418 రాళ్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వాటిని తొలగించిన వైద్యులు షాక్‌ అయ్యారు.

    60 ఏళ్ల వృద్ధుడికి..
    తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న హైదారబాద్‌ సోమాజిగూడలోని ఏసియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ నెఫ్రాలజీ అండ్‌ యూరాలజీ ఆస్పత్రిలో ఓ 60 ఏళ్ల వృద్ధుడు చేరాడు. అతని కిడ్నీ దెబ్బతిన్నటుల వైద్యులు నిర్ధారించారు. వివిధ పరీక్షల తర్వాత మూత్రపిండంలో రాళ్లు ఉన్నట్లు ఉర్తించారు. చికిత్స చేసిన వైద్యులు డాక్టర్‌ పూర్ణచంద్రారెడ్డి, డాక్టర గోపాల్, డాక్టర్‌ దినేష్‌ ఆధ్వర్యంలో రాళ్లు తొలగించాలని నిర్ణయించారు. ఆపరేషన్‌ లేకుండా రాళ్లు తీసేందుకు ఏర్పాట్లు చేశారు.

    ప్రత్యేక విధానంలో సర్జరీ..
    ముగ్గురు వైద్యులు పెర్క్యూటేనియస్‌ నెప్రోలితోటమీ విధానంలో మినిమల్లీ ఇన్వేసివ్‌ పద్దతిలో శస్త్ర చికిత్స చేశారు. చిన్న చిన్న రంధ్రాల ద్వారా లోపలకు సూక్ష్మ కెమరాలను పంపి లేజర్‌ ప్రోబ్‌ల ద్వారా రాళ్లను బయటకు తీశారు. మొత్తం అతని కిడ్నీలో 418 రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. నూతన విధానంలో ఆపరేషన్‌ చేసి ఆ రాళ్లను బయటకు తీయడానికి సుమారు 2 గంటల సమయం పట్టింది.

    మెరుగైన ఆరోగ్యం..
    సర్జరీ తర్వాత వృద్ధుడి ఆరోగ్యం మెరుగైంది. కిడ్నీ పనితీరు కూడా మెరుగు పడడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశామని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం పేషెంట్‌ ఆరోగ్యంగా ఉన్నట్లు వెల్లడించారు. కిడ్నీ ఆరోగ్యం విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇక్క మరో విషయం ఏమిటంటే గురువారం(మార్చి 14) ప్రపంచ కిడ్నీ దినోత్సవం కూడా.