
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మక ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం ఎన్టీఆర్ ఎంతో కండలు తిరిగిన దేహాన్ని రెండేళ్ల పాటు కొనసాగించాల్సి వచ్చింది. ‘కొమురం భీం’ పాత్ర కోసం ఇలా భారీగా ఎన్టీఆర్ కండలు పెంచారు. అది సినిమాల్లో అద్భుతంగానే వచ్చిందట.. ఈ చిత్రం షూటింగ్ చివరిదశకు చేరుకుంది. జూలై చివరి వారంలో ఎన్టీఆర్ తన షూటింగ్ భాగాలను పూర్తి చేస్తాడట..ఇక కండలు కరిగించి స్మార్ట్ గా అవ్వడానికి రెడీ అయ్యాడట..
ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివతో చేయబోతున్నాడు. ఈ ఏడాది అక్టోబర్ నుంచి దీని షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పూర్తి డిఫెరెంట్ గా కనిపించనున్నాడట.. పూర్తి సన్నగా.. స్మార్ట్ గా, స్టైలిష్ లుక్ ను కలిగి ఉంటాడట.. ఈ మేరకు మేకోవర్ కావడానికి రెడీ అయిపోయాడట..
ఆర్ఆర్ఆర్ షూటింగ్ మొత్తం పూర్తయిన తర్వాత ఆ గ్యాప్ లో తన బరువు, కండలను తగ్గించుకుంటాడట ఎన్టీఆర్. కొరటాల శివ సినిమా యాక్షన్ ప్యాక్డ్ సోషల్ డ్రామా కథనట..ఇందులో స్లిమ్ గా.. సింపుల్ గా కనిపించాల.. అందుకోసమే ఆర్ఆర్ఆర్ కోసం పెంచిన కండలను తగ్గించే పనిలో ఎన్టీఆర్ పడబోతున్నాడట..
కొరటాల శివ ప్రస్తుతం చిరంజీవి ‘ఆచార్య’పై దృష్టిపెట్టాడు. ఆ సినిమా పూర్తి చేశాక ఎన్టీఆర్ తో సినిమాను తెరకెక్కిస్తాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ , యువసుధ ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ప్యాన్ ఇండియా సినిమాగానే ఇది రూపొందుతోంది.