NTR: అభిమాన హీరోలు వేసుకునే దుస్తులు, వాళ్ళు ఉపయోగించే ఎలక్ట్రానిక్ పరికరాలను తాము కూడా ఉపయోగించాలని అనుకోవడం సహజం. ఎదో వంద, రెండు వందలు, వెయ్యి రూపాయిల రేంజ్ లో వాటి విలువ ఉంటే ఎవరైనా కొనుగోలు చేయగలరు. కానీ ఒక్కోటి వేలల్లో ఉంటే ఎవరు మాత్రం కొనుగోలు చేయగలరు చెప్పండి. ముఖ్యంగా ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, ప్రభాస్ స్థాయి అభిమాన గణం ఉన్న హీరోలు ధరించే దుస్తులకు, ఎలక్ట్రానిక్ పరికరాలకు మామూలు రేంజ్ డిమాండ్ ఉండదు. రీసెంట్ గా విడుదలైన ఎన్టీఆర్(Junior NTR) ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. బక్క చిక్కిపోయిన ఎన్టీఆర్ ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రశాంత్ నీల్(Prashanth Neel) మూవీ షూటింగ్ కోసమే ఆయన ఇంత సన్నబడ్డాడని తెలుస్తుంది. ఈ నెల 22 నుండి రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు ఎన్టీఆర్.
Also Read: ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రం పై కేసు వేసిన ఇళయరాజా..కారణం ఏమిటంటే!
ఇదంతా పక్కన పెడితే ఈరోజు విడుదలైన ఫొటోలో ఎన్టీఆర్ ధరించిన చొక్కా పెద్ద చర్చకు దారి తీసింది. ‘ఎట్రో’ అనే బ్రాండ్ తో పిలవబడే ఈ చొక్కా ఆన్లైన్ లో అందుబాటులో ఉంది. దీని విలువ దాదాపుగా 85 వేల వరకు ఉంటుందని అంచనా. చూసేందుకు చాలా బాగుంది కానీ, కానీ అంత డబ్బులు పెట్టి మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళు కొనగలరా చెప్పండి. ఎన్టీఆర్ స్థాయి సెలబ్రిటీలు అయితే కచ్చితంగా కొనగలరు. ఎన్టీఆర్ ధరించే ప్రతీ వస్తువు చాలా ధరతో ఉంటుంది. ముఖ్యంగా ఆయనకు హ్యాండ్ వ్వాచ్ గ్యాడ్జెట్ అంటే చాలా ఇష్టం. వాటి విలువ కోట్లలోనే ఉంటుంది అంటే నమ్ముతారా?, కానీ నమ్మక తప్పదు, ఎందుకంటే అది నిజం కాబట్టి. ఆయన వేసుకునే చెప్పులు, ధరించే దుస్తులు, వాచీలు, వాడే కార్లు అన్ని చాలా ఖరీదైనవి. ఇండస్ట్రీ లో ఏ స్టార్ హీరో కూడా ఇంత పోష్ జీవితాన్ని గడపడం లేదు అనేది వాస్తవ నిజమని అంటున్నారు అభిమానులు.
ఇకపోతే ఎన్టీఆర్ ‘వార్ 2′(War 2 Movie) మూవీ షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేశాడు. ఈ చిత్రం ఆగస్టు 14 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కానుంది. హృతిక్ రోషన్(Hrithik Roshan) హీరోగా నటించిన ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారక్టర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం తో ఎన్టీఆర్ నార్త్ ఇండియన్ మార్కెట్ లో శాశ్వతంగా పాగా వెయ్యాలని చూస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రొమోషన్స్ ని కూడా గ్రాండ్ గా ప్రారంభించబోతున్నారు మేకర్స్. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించే షూటింగ్ లో ఒక షెడ్యూల్ ని పూర్తి చేసిన తర్వాత వార్ 2 మూవీ ప్రొమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటాడని తెలుస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రానున్నాయి.
Also Read: ‘విశ్వంభర’ లో కేవలం ఆ ఒక్క పాట కోసం 6 కోట్లు ఖర్చు చేశారా..?