NTR : తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కి ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రస్తుతం ఆయన చేస్తున్న ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో తమదైన రీతిలో సక్సెస్ లను సాధించడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. మరి అలాంటి ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో భారీ సక్సెస్ ని సాధించిన విషయం మనకు తెలిసిందే.ఇక రీసెంట్ గా ఆయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన కామెంట్లైతే చేశాడు. ఆయన ఏం మాట్లాడాడు అంటే ‘ఒక సినిమా చూసేటప్పుడు నాతో కలిపి మనమందరం సినిమాలో ఇది బాలేదు, అది బాలేదు అంటూ వంకలు పెడుతూ సినిమాని చూస్తుంటాం. కానీ నా కొడుకు అయిన భార్గవ్ మాత్రం చాలా ఇన్నోసెంట్ తో సినిమాని చూసి అది ఎలా ఉన్నా బాగుందని చెబుతాడు. మరి అలాంటి ఇన్నోసెన్స్ మనకెందుకు లేదు అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది’ అంటూ ఎన్టీఆర్ చేసిన కామెంట్లు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారుతున్నాయి… ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యాల్లో చాలావరకు మిస్టేక్స్ ఉన్నాయనే చెప్పాలి. ఎందుకంటే చిన్నపిల్లలు సినిమా థియేటర్ కి వెళ్లడమే వాళ్లకు ఆనందాన్ని కలిగిస్తుంది. సినిమా చూసి వాళ్లకు అర్ధమైన, అర్థం కాకపోయినా వాళ్ళు బాగుందనే చెబుతారు. సొసైటీలో చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తూ పర్సనల్ గా చాలా ఇష్యూస్ ని ఎదుర్కొంటున్న చాలామంది కామన్ పీపుల్స్ వల్ల బాధల్ని పోగొట్టుకోవడానికి ఒక 200 రూపాయలు పెట్టి టికెట్ తీసుకొని సినిమా థియేటర్ కెళ్ళి సినిమా చూస్తారు.
వాళ్ళు పెట్టిన డబ్బులకి సినిమా వర్థబుల్ అయితే బాగుందని చెప్తారు. లేకపోతే బాలేదని చెప్తారు. 200 రూపాయలు పెట్టి థియేటర్లోకి వచ్చాడు కాబట్టి వాడికి సినిమాని జడ్జ్ చేసే అవకాశం అయితే ఉంది. మీరు ఫ్రీగా చూపించినప్పుడు మాత్రం వాడు సినిమా బావుంది బాలేదు అని చెప్పకుండా లాజిక్ ల గురించి ఆలోచించకుండా సినిమా మాత్రమే చూస్తాడు.
కానీ డబ్బులు పెడుతున్న ప్రతి ఒక్కరికి సినిమాని జడ్జ్ చేసే అర్హత అయితే ఉంటుంది. అలాగే ఇన్నోసెన్స్ తో సినిమాని చూస్తే ప్రతి ఫ్లాప్ సినిమా కూడా 1000, 2000 కోట్లను కలెక్ట్ చేస్తుంది. అప్పుడు స్లాప్ సినిమాకి మంచి సినిమాకి మధ్య తేడా ఏముంటుంది అంటూ జూనియర్ ఎన్టీఆర్ మీద చాలామంది విరుచుకుపడుతున్నారు. నిజానికి ప్రతి ప్రేక్షకుడు ప్రపంచంలో ఉన్న ఇతర భాషల సినిమాలను చూస్తున్నాడు.
కాబట్టి మన సినిమా చూసినప్పుడు వాటితో పోల్చుకుంటూ వాటికంటే ఈ సినిమా తగ్గిందా వాటితో పాటు సమానంగా ఉందా అనే క్యాలిక్యులేషన్స్ అయితే పెట్టుకుని సినిమా చూడాడమనేది సహజం.. అలాంటి స్టాండర్డ్ లో సినిమా తీసి ప్రేక్షకుడిని మెప్పించడమే దర్శకుడు, హీరోల యొక్క గొప్పతనం..అది సరిగ్గా చేయకుండా ఇన్నోసెన్స్ తో సినిమా చూసి అన్ని సినిమాలను హిట్ చేయాలి అని చెప్పడం రాంగ్ ప్రాసెస్ అవుతుంది తప్ప రైట్ అయితే అవ్వదు. ఈ విషయంలో ఎన్టీఆర్ ని విబేధిస్తున్న వారు చాలామంది ఉన్నారు…