
యావత్తు భారతీయ సినీ లోకం ఆశగా ఎదురుచూస్తున్న క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఉక్రెయిన్ లో జరుగుతుంది. అయితే, ఆర్ఆర్ఆర్ టీమ్ జూనియర్ ఎన్టీఆర్ ఇన్ స్టాగ్రమ్ ను హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత.. నేడు ఒక స్పెషల్ వీడియో ను షేర్ చేసింది. వీడియో ఎన్టీఆర్ వాయిస్ తో మొదలవుతూ.. ‘చరణ్ డ్రమ్స్ ప్రాక్టీస్ పూర్తి అయ్యిందా ?’ అని తారక్ అడగగా,
వెంటనే అలర్ట్ అయిన రామ్ చరణ్ బల్ల పై చేతులతో డ్రమ్స్ ప్రాక్టీస్ చేస్తూ రివీల్ అయ్యాడు. మొత్తానికి కాస్త ఫన్ తో వచ్చిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమా పై నేషనల్ లెవల్లో అభిమానుల్లో ఉన్న అంచనాలను రెట్టింపు చేయడానికి రాజమౌళి పక్కాగా ప్రమోషన్స్ ను ప్లాన్ చేస్తున్నాడు.
అన్నిటికీ మించి మొదటిసారి ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ కలిసి హీరోలుగా నటిస్తుండటంతో ఈ సినిమాకి భారీ బిజినెస్ జరుగుతుంది. ఇప్పటికే ‘పెన్ స్టూడియోస్’ సంస్థ ఈ సినిమా ‘నార్త్ థియేట్రికల్’ హక్కులను సొంతం చేసుకుంది. పెన్ స్టూడియోస్ సంస్థ ‘నార్త్ థియేట్రికల్’ రైట్స్ కోసం రికార్డ్ రేంజ్ లో భారీ మొత్తాన్ని ఆర్ఆర్ఆర్ టీమ్ కి ఇచ్చింది.
ఏది ఏమైనా రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాని అక్టోబర్ 13న రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. అయితే, అక్టోబర్ 13కి మరెంతో సమయం లేదు. అప్పటిలోపు సినిమాని పూర్తి చేలనే ఉద్దేశ్యంతోనే షూట్ కి గ్యాప్ కూడా ఇవ్వట్లేదు. ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్ రెండున్నరేళ్ళకు పైగా ఈ సినిమా కోసం పని చేశారు.
View this post on Instagram